ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్ల సస్పెన్షన్

by Sridhar Babu |
ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్ల సస్పెన్షన్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లో అక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్‌లో అవకతవకలకు పాల్పడ్డ కారణంగా అటవీ అధికారులరను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వేటు పడ్డ వారిలో కరీంనగర్ రేంజ్ ఆఫీసర్ టి.శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ఆఫీసర్‌లు పి. చంద్రమౌళి, జి.పద్మలు ఉన్నారు. అధికారుల అవినీతిపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

Next Story