- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రసాదంలో విషం పెట్టిన అనుమానం
దిశ, వెబ్డెస్క్: తన భార్య పై అనుమానం పెంచుకున్న భర్త ప్రసాదంలో విషం కలిపాడు. పక్కింటి కుర్రాడిని ఖతం చేయాలని ప్లాన్ వేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. వివాహేతర సంబంధం సాగిస్తుందన్న డౌట్తోనే ఇందతా చేసి ప్రస్తుతం ఊసులు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన బీహార్లోని చాప్రాలో కలకలం రేపింది.
వివరాళ్లోకి వెళితే.. చాప్రా ప్రాంతంలో స్థానికంగా పాల బిజినెస్ చేసే పర్వేష్కు గత కొంతకాలం క్రితం పెండ్లి జరిగింది. ఆ తర్వాత సాఫీగా సాగిన అతడి సంసారంలో పక్కింటి అబ్బాయి ఎంటర్ అయ్యాడు. అయితే, తన భార్య అప్పుడప్పుడు పక్కింటి వారితో చనువుగా ఉండేది. అలాగే పక్కింట్లోనే ఉన్న ఓ కుర్రాడితో కొద్దిగా స్నేహంగా ఉండేది.
కుర్రాడితో మాట్లాడటమే తప్పుబట్టిన పర్వేష్ తరచూ భార్య పై నిందలు వేసేవాడు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఆ భార్యభర్తలకు గొడవలు జరిగాయి. భార్య మాత్రం తనదేమి తప్పులేదని వాదించినప్పటికీ పర్వేష్ చెవికి ఎక్కించుకోలేదు. ఇదే వ్యవహారం పై అంతటితో ఆగకుండా పర్వేష్ ఏకంగా పక్కింటి వారితో వాగ్వాదానికి దిగాడు.
నా భార్యతో వివాహేతరం సంబంధం సాగిస్తావా అంటూ కుర్రాడి పై గరం అయ్యాడు. అతడి ఆరోపణలను తిప్పి కొట్టిన కుర్రాడు ‘నీ భార్య నా సోదరితో సమానం’ అని తేల్చి చెప్పాడు. అతడికి వారి కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలిపి పర్వేష్ను ఇంటి వద్ద నుంచి వెళ్లగొట్టారు. ఇది అవమానంగా భావించిన పర్వేష్ ఆ కుటంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు.
భార్య పై ఉన్న అనుమానం, కుర్రాడి పై పెంచుకున్న పగతో అతడిని, కుటుంబాన్ని మొత్తం చంపాలని ఓ ముఠాతో కుమ్మక్కు అయ్యాడు. ఈ నేపథ్యంలోనే కిరాయి ముఠాకు కొన్ని డబ్బులు ఇచ్చి ప్రసాదంలో విషం కలిపించాడు. ఆ తర్వాత దేవుడి ప్రసాదం అంటూ.. కిరాయి ముఠాకు చెందిన ఇద్దరు మహిళలు ఆ కుర్రాడికి అందజేశారు. ఇది గ్రహించని అతడు తాను తినడమే కాకుండా ఇంట్లో వాళ్లకు పెట్టాడు. ఆ తర్వాత బాధితులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాదం ఎవరిచ్చారో అన్న అంశం పై ఆరా తీశారు. పాల వ్యాపారి అయిన పర్వేష్ మీద అనుమానంతో అతడి కదలికల పై సీసీ పుటేజీ ద్వారా నిఘా వేశారు. అయితే, ఇద్దరు మహిళలు అతన్ని కలవడం.. లడ్డూ ఇవ్వడం పుటేజీలో రికార్డు అవడంతో అసలు నిజం బయట పడింది. తన భార్య మీద అనుమానంతోనే ఇదంతా చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు.