- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోట్లు లెక్క కాదు.. గాడ్ ఫాదర్స్ లెక్కేలేదు
– సుశాంత్ ఫ్రెండ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. సుశాంత్ ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీనిచ్చింది తన బెస్ట్ ఫ్రెండ్ రోహిణి అయ్యర్. ‘కోట్లు లెక్కలేనివాడు.. గాడ్ ఫాదర్స్‌ను తిరస్కరించిన వాడు.. అలా ఎందుకు చనిపోతాడని’ ప్రశ్నిస్తోంది. తన చరిత్రను అపహాస్యం చేసేందుకు ట్రై చేయొవద్దని హెచ్చరిస్తోంది.
‘మీరు సుశాంత్ గురించి మాట్లాడాలనుకుంటే.. అతని లైఫ్‌ను సెలబ్రేట్ చేసుకోండి. ఇది తను నిర్మించాలనుకున్న సినిమాల మాదిరిగా.. జీవితం కన్నా చాలా పెద్దది. అతని పనిని సెలబ్రేట్ చేసుకోండి.. తన కళ గురించి హృదయాన్ని, ఆత్మను పెట్టి పనిచేశాడు. తను మేకప్ కన్నా పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చాడు. తను శ్రేష్టత కోసం ఆరాటపడే వాడు తప్ప గర్వంగా ఉండేవాడు కాదు. తను ఓ ప్రకాశవంతమైన నక్షత్రం.. అందుకే మాయాజాలంలా ప్రకాశించాడు’ అని తెలిపింది.
‘సామాన్యత అతడిని ప్రభావితం చేసింది.. అందుకే గాడ్ ఫాదర్స్‌ను, పెద్ద టికెట్ చిత్రాలను తిరస్కరించాడు. అతను డబ్బు గురించి పట్టించుకోలేదు.. కోట్ల విలువైన చెక్కులను తిరిగిచ్చేశాడు. తను ఫోన్ స్విచాఫ్ చేసి వ్యవసాయం లేదా షిపింగ్‌కు వెళ్లాలనుకుంటే వెళ్లగలడు. నిబంధనలు బ్రేక్ చేస్తూ తన దారిలో వెళ్లేందుకు వంతెనలు తగలబెట్టగలడు. తను నా బెస్ట్ ఫ్రెండ్, నా కొడుకు, నా మొజార్ట్. తను నాకు సంగీతం, కళ, సంస్కృతి, కవిత్వం, పుస్తకాలు అన్నీ ఇచ్చాడు. ముఖ్యంగా తను నాకు జ్ఞాపకాలు ఇచ్చాడు. అతను ఎవరి గురించి పట్టించుకోలేదు. ఎవరేమన్నారనే దాని గురించి ఆలోచించలేదు.
తన సంస్కారాన్ని కొందరు అర్థం చేసుకోలేక పోతున్నారు. ప్లాస్టిక్‌కు మాత్రమే అలవాటుపడిన వారు నిజమైన వజ్రాన్ని గుర్తించలేకపోవచ్చు. అలాంటి వారికి తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నమ్మకానికి మించిన తెలివైన తన గురించి మీరు చదివి కూడా ఉండకపోవచ్చు. మీకో విషయం తెలుసా..? అతను మీ మూగ అభిప్రాయాల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోడు కూడా. కానీ నేను పట్టించుకుంటాను.. ఎందుకంటే తన చరిత్రను కాపాడుకోవడం నాకు ముఖ్యం’ అంటూ తన ఫ్రెండ్ మరణంపై అనవసర రాజకీయాలు చేయొద్దని హెచ్చరించింది.