- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దిశ’ ఆత్మకు శాంతిని దూరం చేయొద్దు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన మరణించి 20 రోజులు దాటినా.. అసలు కారణమేంటో ఇంకా తేల్చలేదు పోలీసులు. అయితే సుశాంత్‌ది సూసైడ్ కాదు, మర్డర్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. ఈ స్టోరీలో మ్యాటరేంటంటే.. సుశాంత్ ఎక్స్ మేనేజర్ దిశ, నటుడు సూరజ్ పంచోలి, సల్మాన్ ఖాన్, మహేష్ భట్ పాత్రధారులుగా ఉన్నారు. విషయం ఏంటంటే సూరజ్ పంచోలి వల్ల దిశకు ప్రెగ్నెన్సీ వచ్చిందని.. ఆ విషయం సుశాంత్‌తో చెప్పుకుని దిశ బాధపడిందని.. సుశాంత్ స్నేహితుడు సందీప్, గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సుశాంత్ ఈ విషయం చెప్పగా.. వారిద్దరూ సల్మాన్ ఖాన్, మహేశ్ భట్‌లకు మ్యాటర్ లీక్ చేశారని పోస్ట్ సారాంశం. సల్మాన్, మహేశ్ సపోర్ట్‌తో దిశను సూరజ్ పంచోలి బిల్డింగ్‌పై నుంచి నెట్టేసి చంపేశారనే వార్త హల్ చల్ చేస్తోంది.
https://www.instagram.com/p/CCS7qZJnwc9/?igshid=1mgefkqbrmg5b
ఈ వార్తతో బాధపడిన దిశ ఫ్యామిలీ.. మీడియాకు నోట్ రిలీజ్ చేసింది. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయొద్దని కోరింది. ‘మనం ప్రేమించే వాళ్లు, మనల్ని ప్రేమించే వాళ్లు పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అదే బాధలో మేమున్నాం.. ఆ నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చేందుకు హెల్ప్ చేయండి తప్ప.. ఇలాంటి తప్పుడు వార్తలతో మరింత బాధ పెట్టొద్దని’ కుటుంబీకులు కోరారు. ఒకరి మరణంపై ఇష్టారీతిన ఊహించి న్యూస్ స్ప్రెడ్ చేయడం మంచిది కాదన్నారు.
దిశ ఒకరికి కూతురు, ఒకరి ఫ్రెండ్, ఒకరి సోదరి అన్న విషయం గుర్తుంచుకోవాలని.. ఆ ప్లేస్‌లో ఉంటే ఎంత ఇబ్బందిగా, బాధగా ఫీల్ అవుతారో గుర్తుంచుకోవాలన్నారు. ప్రేమించడం అనేది మానవులకు ఉండాల్సిన ప్రథమ లక్షణమని.. ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసి దిశ ఆత్మకు శాంతి లేకుండా చేయొద్దని కోరారు.