సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ బదిలీ

by Shyam |   ( Updated:2021-10-08 12:07:01.0  )
SP Bhaskaran
X

దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ అనూహ్యంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ బదిలీ అయ్యారు. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన భాస్కరన్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో బాధ్యతలు స్వీకరించారు. 2019 అక్టోబర్‌లోనే ఆయన జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. సరిగ్గా రెండేళ్లలో ఆయన బదిలీ కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లాలో యంగ్ డైనమిక్ ఆఫీసర్‌గా భాస్కరన్ ప్రజలు మన్ననాలు పొందారు.

Rajendraprsad

కాగా, సూర్యాపేట జిల్లా నూతన ఎస్పీగా నాన్ కేడర్ అధికారి ఎస్.రాజేంద్ర ప్రసాద్‌ను నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో వీఆర్‌లో ఉన్నారు. కాగా, భాస్కరన్‌ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed