కౌశిక్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చెవిటి వెంకన్న

by Shyam |
cheviti Venkanna Yadav
X

దిశ, సూర్యాపేట: హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్‌చార్జి పాడి కౌశిక్ రెడ్డిపై సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కోవర్ట్ కౌశిక్ రెడ్డికి ఖబర్దార్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం వెంకన్న యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్ట్రాల్ ఒక టీఆర్ఎస్ పార్టీ కోవర్ట్ మా టీపీసీసీ అధ్యక్షుడిని విమర్శలు చేయడం సరికాదని, వెంటనే కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, బహిరంగా క్షమాపణలు చెప్పాలని సూచించారు. లేకపోతే.. అదే హుజురాబాద్‌లోని మహిళా కార్యకర్తల చేత చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా లీడర్ అయిన కౌశిక్ రెడ్డి రేవంత్‌ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌లో ప్రోటోకాల్ ప్రకారం అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేయాలని, ప్రతి కార్యకర్తా పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాలపై పోరాటం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సైకిల్ యాత్రను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story