ఏపీలో 28 వేల మందిపై నిఘా?

by srinivas |
ఏపీలో 28 వేల మందిపై నిఘా?
X

కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత విదేశాల నుంచి ఇండియాకు 15 లక్షల మంది వచ్చారని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వీరంతా గత జనవరి 15 నుంచి 23 మార్చి మధ్య కాలంలో దేశానికి వచ్చిన వారే కావడం విశేషం. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి, హోం క్వారంటైన్‌‌లో ఉండాలని చెప్పి, వారిపై నిఘా పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాలకు లేఖలు రాశారు.

వీరిలో కొందరికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వారికి పరీక్షలు నిర్వహించి, వారు నివాసం ఉంటున్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించాలని కూడా ఆ లేఖలో సూచించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ దేశాలకు చెందిన 28,000 మంది ఉంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వారిపై నిఘా ఉందని కూడా వెల్లడించింది.

వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిందా? లేదా? అన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే వలంటీర్లు, ఆశావర్కర్ల ద్వారా వారిపై నిఘా ఉంచినట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కరోనా కేసులు ఆందోళన రేపుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 13 మందికి కరోనా సోకింది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే భద్రత కట్టుదిట్టంగా ఉండడంతో కరోనాపై ఆధిపత్యం సాధిస్తామని ప్రభుత్వం ధీమాగా ఉంది.

Tags: corona, ap, precautions, nri’s, foreigners

Advertisement

Next Story

Most Viewed