నేటి సర్పంచ్‌లు అదృష్టవంతులు..

by Shyam |
నేటి సర్పంచ్‌లు అదృష్టవంతులు..
X

ఇప్పుడున్న సర్పంచ్‌లు చాలా అదృష్టవంతులని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ములుగు జిల్లా లీలా గార్డెన్స్‌లో పంచాయతీరాజ్‌ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆమె విచ్చేసి మాట్లాడుతూ..నాటి సర్పంచులకు అరకొర నిధులు వచ్చేవని కానీ నేటి సర్పంచులకు ఫుల్ నిధులు విడుదలవుతున్నాయని తెలిపారు. అప్పట్లో తాగునీటి అవసరాలకు కూడా నిధులు చాలేవి కాదని, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే ధర్నాలు జరిగేవన్నారు. కానీ ఇప్పుడు మిషన్‌ భగీరథ కింద తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్‌, పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్లు ఇస్తున్నారన్నారు. పల్లెల్లో ఇప్పుడు మంచి ప్రగతి కనిపిస్తోందని, ఆర్థిక మాంద్యం ఉన్నా పల్లె ప్రగతికి సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నెలకు రూ.338 కోట్లు క్రమం తప్పకుండా ఇస్తున్నారని వివరించారు. కలెక్టర్‌ దగ్గర ఉన్న నిధులు కూడా బాగా పనిచేసిన వారికి ఇవ్వాలని నిర్ణయించారన్నారు. కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్‌లు పోటీపడి పనిచేసి పల్లె ప్రగతి చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌, ఏటూరు నాగారం పి.వో. హనుమంతు, డీఎఫ్‌వో ప్రవీణ్‌శెట్టి, జడ్పీ సీఈవో పారిజాతం, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story