రైనా లవ్స్ సోనాలి బింద్రే

by Shyam |
రైనా లవ్స్ సోనాలి బింద్రే
X

సోనాలి బింద్రే… మురారి, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న సోనాలి బాలీవుడ్‌తోపాటు సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న హీరో అయినా సూపర్‌స్టార్ అయినా సరే… ఎవరి పక్కన అయినా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే సోనాలికి ఆఫర్లకు కొదవలేకుండా పోయింది ఒకప్పుడు. ఉదాహరణకు మురారిలో మహేష్‌బాబుకు జోడీగా ఎంత బాగా సెట్ అయిందో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో చిరుకు జంటగా అంతే చక్కగా సరిపోయింది. పైగా ఆమె యాక్టింగ్‌కు ఫిదా కానివారు ఉండరు.

ఇదిలా ఉంటే ఆమె అందానికి ప్రేక్షకులు, హీరోలు మాత్రమే కాదు క్రికెటర్లు కూడా పడిపోయారు. హీరోయిన్లతో క్రికెటర్ల రిలేషన్‌షిప్, డేటింగ్ కామన్. అలాగే ప్రముఖ క్రీడాకారుడు సురేష్ రైనా కూడా ఇలాంటి ఆలోచనే చేశాడట. సోనాలి అందానికి ముగ్ధుడైన రైనా తనతో డేటింగ్ వెళ్లాలని, తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. కానీ, కుదరలేదట. ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి యాంకర్ అడగ్గా సోనాలి అంటే చాలా ఇష్టమని, చాలా క్రష్ ఉండేదని తెలిపాడు. గతంలో షోయబ్ అక్తర్ కూడా సోనాలి బింద్రేపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. తనను పాకిస్థాన్‌కు ఎత్తుకెళ్లి పోతానని అంటూ తనపై ఉన్న ఇష్టాన్ని తెలిపాడు.

Advertisement

Next Story