- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెపోటిజమ్ సరే.. ప్రేక్షకాదరణ మాటేంటి ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజాన్ని ప్రశ్నించింది. ప్రేక్షకుల ధాటికి స్టార్స్ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకునేలా చేసింది. కొన్ని రాష్ట్రాల్లో బాలీవుడ్ బడా దర్శక, నిర్మాతల సినిమాలు బ్యాన్ చేసేలా చేసింది. తాజాగా ఈ విషయంపై స్పందించారు ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు.
వారసత్వం అనేది ఉన్నా సరే.. టాలెంట్ ఉంటేనే రాణించగలరు అంటున్నారు సురేశ్ బాబు. సుశాంత్‌కు చాలా టాలెంట్ ఉంది.. స్టార్‌గా కూడా ప్రూవ్ చేసుకున్నాడన్న ఆయన.. నెపోటిజం అనేది ప్రతీ ఒక్కరి మీద తెలిసో తెలియకో ప్రభావం చూపుతుందని.. కానీ ఎవరికి వారు వారి టాలెంట్ నిరూపించుకోవాల్సిందే అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి వారు చాలా కష్టపడి ఎదిగారని అన్నారు. అదే సమయంలో చాలా మంది వారసత్వం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా రాణించలేక పోయారని తెలిపారు. యాక్టర్ నటన, ప్రేక్షకుల ఆదరణ ముఖ్యపాత్ర పోషిస్తాయన్న సురేశ్ బాబు.. ఒకవేళ తన కొడుకు అభిరామ్‌కు చాన్స్ ఇస్తే.. నేర్చుకుంటే ఓకే లేదంటే కష్టమవుతుందని అన్నాడు.