- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా చేయిదాటిపోతోంది.. కట్టడి చేయండి’
న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ ఉధృతమవుతున్నాయని, కేంద్ర సర్కారు, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహమ్మారిని నిలువరించడానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, అసోం రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఇప్పటి వరకు తీసుకున్న, తీసుకోవాలనుకుంటున్న చర్యల వివరాలు, అలాగే, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని గురించిన అఫిడవిట్లను అందించాలని ఆదేశించింది.
ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి చేయి దాటిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెలలో ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరిగాయని, రాష్ట్రాలు కరోనాపై పోరుకు సన్నద్ధం కాకుంటే వచ్చే నెలలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదమున్నదని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉధృతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణకు కేంద్ర సర్కారు.. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఉన్నతస్థాయి బృందాలను ఆదివారం పంపించింది. రాజస్తాన్, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గడ్‌లకూ ఇటీవలే పంపిన విషయం విదితమే.