వరవరరావు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆదేశం

by Anukaran |   ( Updated:2020-10-29 11:49:03.0  )
వరవరరావు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వీలైనంత త్వరగా ఆయనకు బెయిల్ ఇచ్చే విషయాన్ని తేల్చాలని ముంబయి హైకోర్టును ఆదేశించింది. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించిన అంశాలన్నీ ముంబయి హైకోర్టు పరిధిలో ఉన్నందున సుప్రీంకోర్టు తరఫున బెయిల్ ఇవ్వలేమని, ఆయనకు బెయిల్ ఇచ్చే విషయం ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్నందున త్వరితగతిన విచారణ ప్రక్రియను ముగించాలని మాత్రమే ఆదేశించగలమని జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ రవీందర్ భట్, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. ఆయనకు తలోజా జైలులో సరైన వైద్య సౌకర్యాలు లేనట్లయితే వాటిని మెరుగుపర్చడం లేదా ఆసుపత్రికి తరలించడం చేయాలని హైకోర్టుకు స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed