- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ఆలయ నిర్వహణ.. రాజవంశీకులదే
న్యూఢిల్లీ: ట్రావెన్‌కోర్ రాజవంశీకులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజవంశీకులకే ఉంటుందని స్పష్టం చేసింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ ఆలయంపై నియంత్రణను రాజకుటుంబ సభ్యులున్న ట్రస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాజవంశీయులు కోర్టును ఆశ్రయించారు. 2011లో ఈ ఆలయం ఒక్కసారి సంచలనమైంది. పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో నిధులు, నిక్షేపాలున్నాయని చర్చలు జరిగిన నేపథ్యంలో ఇన్వెంటరీకి కోర్టు ఆదేశించింది. ఆరు నేలమాలిగళ్లోని ఐదింటిని తెరువగా భారీగా నిధులు బయటపడ్డాయి. ఆరోగది తెరవడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆ గది తెరిస్తే ప్రళయం వస్తుందని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ గది అలాగే తెరవకుండానే ఉండిపోయింది. తాజాగా, ఆ గది తెరవడం రాజకుటుంబీకుల అభీష్టానికే సుప్రీంకోర్టు వదిలేసింది.