ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‎పై విచారణ

by srinivas |
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‎పై  విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆయుధాల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో సస్పెండ్‌కు గురైన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం “నాట్‌ బిఫోర్‌ మీ” అని అన్నారు. వ్యక్తిగతమైన కారణాలతో ఆయన ఈ కేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై దీపావళి తర్వాత మరో ధర్మాసనం విచారించనుంది.

Advertisement

Next Story