- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు చెల్లించాలి !
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి డిపాజిట్ దారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆండాళ్ రమేష్ బాబు వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరుపు న్యాయవాది శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కేసును హైదరాబాద్ హైకోర్టు 2015నుంచి విచారించి పలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే క్రమంలో కొనసాగాల్సిన విచారణ ఈ ఏడాది మార్చి నుంచి నిలిచినట్టు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి రూ.1050 కోట్లను డిపాజిటర్లకు పంపిణీ చేయాలని సూచించినా హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. హైకోర్టులో పెండింగ్ కేసును త్వరగా విచారించేలా సూచించాలని కోరారు. పిటిషనర్ తరుపు వాదనలకు స్పందించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్, కేసు విచారణ వేగంగా చేయాలని హైదరాబాద్ హైకోర్టుకు విన్నవించాలని, లక్షల మంది డిపాజిటర్లతో ముడిపడి ఉన్నందున ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేసే వెసులుబాటు కల్పిస్తూ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చారు.