- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులు ఆందోళన చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు: సుప్రీంకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రైతులను ఢిల్లీ సరిహద్దుల నుంచి ఖాళీ చేయించాలన్న అంశంపైనే మొదటగా విచారిస్తామన్న సుప్రీంకోర్టు, చట్టాలను రద్దు చేయాలన్న పిటిషన్‌లను తర్వాత పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారి తీయొద్దని తెలిపింది. అన్నదాతలు తమ ధర్నాలను కొనసాగించుకోవచ్చన్న సుప్రీం.. సమస్య పరిష్కారానికి ఇదే సరైన మార్గం కాదని పేర్కొంది. మీ లక్ష్యాలు నెరవేరాలంటే చర్చలతోనే సాధ్యమని.. కానీ, ఆందోళనలు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన రైతు సంఘాల నేతలకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.