- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూచనలు కాదు.. నియంత్రణ అవసరం : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ఓవర్ ది టాప్(ఓటీటీ) వేదికల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు బలహీనంగా ఉన్నాయని, దర్యాప్తు చేయడానికి అవసరమైన నిబంధనలేవీ లేవని సుప్రీంకోర్టు తెలిపింది. కోరలు లేని మార్గదర్శకాలుగా పేర్కొంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సూచనలు చేసే వ్యవస్థకు బదులు వాటిని నియంత్రించే మెకానిజం కోసం చట్టం తయారుచేయాలని సూచించింది. కేంద్రం రూపొందించిన కొత్త మార్గదర్శకాలతో ఉల్లంఘనలకు పాల్పడినవారిపై దర్యాప్తు మొదలుపెట్టే అవకాశం లేదని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాశ్ రెడ్డిల ద్విసభ్య ధర్మాసనం వివరించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ మార్గదర్శకాలకు సంబంధించిన నిర్ణయాలను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
ఓటీటీలు ఒక్కోసారి అశ్లీలతనూ చూపిస్తున్నాయని, వాటి నియంత్రణకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను సమర్పించాల్సిందిగా గురువారం కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓటీటీల్లో శృంగార దృశ్యాలు చూపిస్తున్నాయని న్యాయమూర్తి గురువారం అన్నారని, కానీ, తాము పోర్నోగ్రఫీని చూపించడం లేదని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలియజేశారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లు ప్రపంచవ్యాప్తంగా మూవీలను ప్రదర్శిస్తున్నాయని, తాము పోర్నోగ్రఫీని చూపించడం లేదని స్పష్టం చేశారు. అద్భుతమైన సినిమాలు ఈ వేదికల్లో ప్రదర్శిస్తున్నామని వివరించారు. తాండవ్ సిరీస్‌పై దాఖలైన పిటిషన్ విచారిస్తుండగా కేంద్రం అభ్యంతరం తెలిపిన దృశ్యాలను తొలగించామని రోహత్గీ తెలిపారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్‌కు అనుకూలంగా ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టు నుంచి ఆమెకు రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపింది. అలాగే, యూపీ ప్రభుత్వానికి ముందస్తు బెయిల్‌కు సంబంధించిన నోటీసులను పంపింది.