వచ్చే నెల 17 నుంచి కూలింగ్ పిరియడ్‌పై వాదనలు

by Shyam |
వచ్చే నెల 17 నుంచి కూలింగ్ పిరియడ్‌పై వాదనలు
X

దిశ, స్పోర్ట్స్: కూలింగ్ పిరియడ్‌పై వచ్చే నెల 17 నుంచి వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణను వాయిదా వేసింది. లోథా కమిటీ సిఫారసుల ప్రకారం బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించారు. నూతన సవరణల ప్రకారం వరుసగా ఆరేండ్లపాటు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ల పదవులను అనుభవించిన వారు మూడేండ్లు కూలింగ్ పిరియడ్‌లో ఉండాలి. ఈ నిబంధన ప్రకారం నెల క్రితం బీసీసీఐ కార్యదర్శి జై షా పదవి కోల్పోయారు. ఈ నెల 27తో బీసీసీఐ చైర్మన్ ఆరేళ్ల పదవీకాలం( బీసీసీఐ, క్యాబ్ పదవీ కాలంతో కలపి) పూర్తి కానుంది. కూలింగ్ పిరియడ్‌ నిబంధన ఎత్తివేయాలని గత ఏడాది డిసెంబర్‌, ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో బీసీసీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వచ్చే నెల 17 నుంచి వాదనలు వింటామని, విచారణను వాయిదా వేసింది.

Advertisement

Next Story