షహీన్‌బాగ్: నిరసన స్థలం మార్పుపై సుప్రీం

by Shamantha N |
షహీన్‌బాగ్: నిరసన స్థలం మార్పుపై సుప్రీం
X

షహీన్‌బాగ్‌లో నిరసనలతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నందున నిరసన స్థలాన్ని మార్చుకుని మరోచోట ఆందోళనలు చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ‘నిరసన పౌరుల ప్రాథమిక హక్కు దాన్ని కాదనలేం. రోడ్లు బ్లాక్ అవుతున్నాయంటే.. మరి ప్రత్యామ్నాయ స్థలమేముందని?’ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వారు మరో స్థలాన్ని చూసుకోవచ్చునని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది సూచించారు. నిరసనలతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులు అందగా.. ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారిస్తూ.. ‘నిరసనలతో సమస్య లేదు. కానీ రేపు ఇలాగే మరికొందరు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ఇతరులు ఎలా ప్రయాణిస్తార’ని ప్రశ్నించింది. దీనికి నిరసనకారుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తాము నిరసనలు కొనసాగిస్తామని, అయితే, చాలా మంది ప్రయాణించే రోడ్లను ప్రభావితం చేయకుండా నిరసనలు చేసుకుంటామని తెలిపారు. కొంచెం సమయమివ్వండి.. దీనిపై ఆలోచనలు చేస్తామని వివరించారు. కాగా, నిరసనకారులతో చర్చించి పరిష్కారాన్ని చూపేందుకు ముగ్గురు మధ్యవర్తుల పేర్లను సుప్రీంకోర్టు పేర్కొంది. అందులో సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్దే, సాధన రామచంద్రన్‌లున్నారు. వీరు షహీన్‌బాగ్‌ నిరసనకారులతో చర్చలు జరుపుతారని, పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed