- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాల్సిందే..
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అభివృద్ధి పనులకు ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఎన్నికల సంఘం ఏవైనా అభివృద్ధి పనులను ఆపిందా అని సీజే ప్రశ్నించారు. కాగా, ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ప్రభుత్వం ఈసీ అనుమతి ఎలా తీసుకుంటుందని రోహత్గి ప్రశ్నించారు. ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈసీ అనుమతి ఇవ్వకపోతే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.