టీఆర్ఎస్​ అనుకూల గ్రామాల్లోనూ ఈటలకే మద్దతు

by Shyam |   ( Updated:2021-11-02 23:57:18.0  )
etala-rajender 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ​అనుకూల గ్రామాల్లోనూ ప్రజల మద్దతు ఈటలకే లభించింది. దీంతోనే ప్రతీ గ్రామంలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించింది. ప్రభుత్వ పథకాలు, హామీలను ప్రజలెవ్వరూ విశ్వసించలేదు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధును షురూ చేసిన ఊర్లల్లోనూ టీఆర్ఎస్ ​పార్టీకి గట్టి షాక్ తగిలింది. శాలపల్లి, ఇందిరానగర్​ కాలనీల్లో బీజేపీ హవా కొనసాగించడం గమనార్హం. ప్రతీ రోజూ ఓ మంత్రి ప్రచారం చేసినా.. టీఆర్ఎస్ ​పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. దీంతో పాటు హుజూరాబాద్ ​ఉప ఎన్నిక నోటిఫికేషన్​ విడుదలైనప్పటి నుంచి మంత్రి హరీష్​రావు అదే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతీ గ్రామంలోని గడప తట్టి టీఆర్ఎస్ ​పార్టీకి ఓటును వేయాలని అభ్యర్ధించారు. టీఆర్ఎస్​ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీతో పోల్చితే తక్కువ ఓట్లనే తెచ్చుకున్నది.

ఇక టీఆర్ఎస్ ​అభ్యర్థితో పాటు ముఖ్య లీడర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల ఊర్లలోనూ బీజేపీ అత్యధిక ఓట్లను సాధించుకోవడం గమనార్హం. మరోవైపు ఓటుకు సుమారు పది వేలు పంచినా టీఆర్ఎస్ ​పార్టీకి సరైన శాతంలో ఓట్లు రాలేదు. పైసలు కంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు హూజూరాబాద్​ ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. ప్రజలు ఎంతో చైతన్యాన్ని ప్రదర్శించారని పలువురు రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed