హ్యాపీ బర్త్‌డే నాన్నా.. మీకు ధన్యవాదాలు : మహేష్‌ బాబు

by Shyam |
Mahesh Babu, Krishna
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 78వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా అభిమానులు, స్నేహితులు ఎక్కడ కూడా పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, ప్రస్తుత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

Advertisement

Next Story