'మేజర్' అప్డేట్ ని రివీల్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

by Shyam |   ( Updated:2021-03-15 05:40:43.0  )
మేజర్ అప్డేట్ ని రివీల్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్:టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సస్పెన్స్ క్రైమ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ హీరో ఈసారి ఒక బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ఎంతోమంది ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్టయిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ ని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా తెలిపింది. నేడు సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి ని పురస్కరించుకొని ఈ సినిమా టీజర్ ని మార్చి 28 న విడుదల చేయనున్నట్లు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మహేష్ బాబు తెలిపారు. దీంతో పాటు ఒక గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంటల మధ్యలో మేజర్ సందీప్ ప్రజలను ఎలా కాపాడాడు ? అనేది చూపించారు. ఇక ఈ చిత్రంలో అడవి శేష్ సరసన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది జూలై 2 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో అడవి శేష్ మరో వైవిధ్యమైన హిట్ ని అందుకొంటాడేమో చూడాలి.

https://twitter.com/urstrulyMahesh/status/1371408363473412101

Advertisement

Next Story

Most Viewed