స్టెప్పులతో అదరగొట్టిన సూపర్ స్టార్ డాటర్

by Shyam |   ( Updated:2023-04-01 15:00:07.0  )
స్టెప్పులతో అదరగొట్టిన సూపర్ స్టార్ డాటర్
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికీ తెలిసిందే. అందులోనూ తన గారాల పట్టి సితార అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం. తన లాక్‌డౌన్ టైమ్‌ను కొడుకు గౌతమ్, కూతురు సితారలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్. తన కూతురు సీతు పాప చేసే అల్లరిని చూసి తెగ మురిసిపోయే ప్రిన్స్.. ఆ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటాడు. తాజాగా సీతు పాప.. సూపర్ స్టార్ ఫేవరెట్ సాంగ్‌ బీ హ్యాపీకి స్టెప్పులేసింది. సితార చాలా క్యూట్‌గా వేసిన డాన్స్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్‌ అభిమానులు కూడా సితార డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. గ‌తంలో తండ్రి సినిమా ‘మ‌హ‌ర్షి’లోని పాల‌పిట్ట పాట‌కు, స‌రిలేరు నీకెవ్వ‌రులో ‘డాంగ్ డాంగ్’ పాట‌కు స్టెప్పులేసిన విష‌యం తెలిసిందే. చిన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సితార.. ఇటీవలే తనే సొంతంగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను కూడా తెరిచింది. అంతేకాదు సితార, వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య ఇద్దరూ కలిసి ‘ఎ అండ్ ఎస్’ పేరుతో కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయగా మంచి స్పంద‌న లభించింది. వీరిద్దరూ ఈ ఛానల్ ద్వారా జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేలా ప‌లు అంశాల గురించి మాట్లాడుతుండటం విశేషం.

Advertisement

Next Story