- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెమోక్రటిక్ అభ్యర్థిగా బెర్ని శాండర్స్?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఈ మంగళవారం (సూపర్ ట్యూస్‌డే) కీలకమైంది. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు రెండు పార్టీలు డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఎవరనేది దాదాపు ఖరారైపోతుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ మిగతావారికంటే భారీగా ముందంజలో ఉండటంతో.. డెమోక్రటిక్ అభ్యర్థిపైనే అందరి దృష్టి పడింది. డెమోక్రటిక్ పార్టీలో బెర్నీ శాండర్స్, జో బిడెన్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే, ముందంజలో మాత్రం బెర్నీ శాండర్స్ కొనసాగుతున్నారు.
ఈ అభ్యర్థులు పోటీలో పీట్ బటిగీగ్, ఆమీ క్లొబ్యుచర్, టామ్ స్టీయర్‌లు శనివారం తప్పుకున్నారు. ఈ సూపర్ ట్యూస్‌డే పోటీలో కాలిఫోర్నియా, టెక్సాస్ సహా 14 రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధుల ఎన్నిక జరుగుతుంది. కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి అధిక జనాభా గల రాష్ట్రాల్లో ప్రైమరీ పోల్స్ జరుగుతుండటంతో దాదాపు అభ్యర్థి ఎవరనేది ఖరారవుతుందని అందరు భావిస్తున్నారు. ప్రైమరీ పోల్స్‌లో ప్రజలు డెలిగేట్స్ లేదా పార్టీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరే జులైలో జరిగే కన్వెన్షన్‌లో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మంగళవారం నాటి పోల్స్‌లో డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా బెర్నీ శాండర్స్ దాదాపు ఖరారైనట్టేనని భావిస్తున్నారు.