బ్రేకింగ్ న్యూస్… ఆ హాస్పిటల్ సీజ్

by Anukaran |
బ్రేకింగ్ న్యూస్… ఆ హాస్పిటల్ సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే విజయవా కొవిడ్ ఆసుపత్రిలో సంఘటన చోటు చేసుకున్న అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝులిపిస్తోంది. ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టి ఏ మాత్రం కనిపించినా సీజ్ చేస్తోంది.

తాజాగా ఏలూరులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మురళీకృష్ణ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ను వైద్యారోగ్య శాఖ సీజ్ చేసింది. కరోనా పేషెంట్ల నుంచి రూ. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో శుక్రవారం అర్థరాత్రి హాస్పిటిల్ పై వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ శాఖ దాడులు చేశాయి. అనంతరం తనిఖీలు నిర్వహించాయి. తదనంతరం ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆసుపత్రిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది..

Advertisement

Next Story