- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాక్‌కు గురైన కొవిడ్ 19 సూపర్ కంప్యూటర్లు
కొవిడ్ 19 మీద పరిశోధనల కోసం యూరప్‌లో ఉపయోగిస్తోన్న సూపర్ కంప్యూటర్లు హ్యాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో మిగతా కంప్యూటర్లను కూడా ఆఫ్‌లైన్ చేసినట్లు సమాచారం. స్విట్జర్లాండ్, జర్మనీ, యూకే దేశాల్లోని సూపర్ కంప్యూటర్లు హ్యాక్‌కు గురికాగా, దీని వెనక ఎవరి హస్తం ఉందనేది ఇంకా తెలియరాలేదు. కొవిడ్ 19 వైరస్ మానవ శరీరంలోని కణాల మీద ఎలా దాడి చేస్తుంది? ఏవిధమైన చికిత్స చేస్తే దాన్ని నియంత్రణలో ఉంచవచ్చనే అంశాల గురించి ఈ సూపర్ కంప్యూటర్లు లక్షల కొద్దీ సిమ్యులేషన్లు నడుపుతాయి. సాధారణ కంప్యూటర్ల ద్వారా ఈ సిమ్యులేషన్లు నడపడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి సూపర్ కంప్యూటర్ల సాయం తీసుకుని పరిశోధనలో పురోగతి సాధిస్తారు.
అయితే ఈ హ్యాకింగ్ గురించి సంబంధిత ల్యాబ్‌లు తమ వంతు ప్రకటన చేశాయి. కేవలం లాగిన్ పోర్టల్ మాత్రమే హ్యాక్ అయిందని, కంప్యూటేషన్లు జరిపే మెషిన్ల వరకు ఏం కాలేదని తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే హ్యాకర్ కంప్యూటేషన్ మెషిన్లలోకి ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చేసి లాగిన్ పోర్టల్ మాత్రమే దాటగలిగాడని చెప్పాయి. అయితే దీని గురించి అక్కడ పనిచేసే ఉద్యోగులు బయట ఎలాంటి సమాచారాన్ని పంచకూడదనే నిబంధన ఉండటంతో మరిన్ని విషయాలు తెలియరాలేదు. ఈ హ్యాక్ వెనక రెండు కారణాలు ఉండొచ్చని, హ్యాకర్ కొవిడ్ 19 రీసెర్చ్ దొంగిలించి బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం లేదా రీసెర్చ్ అంశాలను నాశనం చేసి పరిశోధనను నెమ్మదింప చేయడమనే ఉద్దేశాలు అయ్యుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.