ర్యాంప్ పై కిందపడటం కంటే అదే నన్ను తెగ భయపెట్టేది : సన్నీలియోన్

by Shyam |
Sunny Leone
X

దిశ, వెబ్‌డెస్క్ :సన్నీలియోన్.. ఈ పేరు వింటేనే కుర్రకారులో ఏదో తెలియని వైబ్రేషన్. ఒకప్పుడు బోల్డ్ కంటెంట్ మూవీలో యాక్ట్ చేసిన సన్నీ.. ప్రస్తుతం స్టోరీ బేస్డ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు బీ టౌన్‌లో టాక్ నడుస్తోంది. అయితే, గత కొన్నాళ్లుగా సన్నీ సినీ తెరపై కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ సన్నీని చాలా మిస్ అవుతున్నారట. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించే సన్నీ.. సినిమాలు తగ్గించడంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారట. కానీ, అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా సన్నీ స్పందిస్తుండటంతో వాటితోనే అభిమానులు సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలిసింది.

తాజాగా స్టాండప్ కామెడీ మీద సన్నీ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అయ్యింది. ‘ఫ్యాషన్ షోలో ర్యాంప్ మీద పడటం కంటే స్టాండ్-అప్ కామెడీ భయానకంగా ఉంటుందని’ సన్నీ లియోన్ పేర్కొన్నారు. ‘మనం జోక్ వేసిన సమయంలో ఒక్కోసారి ఎవరూ నవ్వరు. అదే నాకు పెద్ద భయం’ అని సన్నీ చెప్పింది. నేను నటిగా తనపై ఒక జోక్ లేదా రెండు వేసినప్పుడు నార్మల్‌గా తీసుకోవడాన్ని నేర్చుకున్నానని, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కఠినంగా కాకుండా తేలికైన కోణంలో చూడటం నేర్చుకున్నానని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed