అద్భుతం ఆవిష్కృతం.. స్వామిని తాకిన కిరణాలు

by srinivas |   ( Updated:2021-03-09 20:09:22.0  )
అద్భుతం ఆవిష్కృతం.. స్వామిని తాకిన కిరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యానారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మూల విరాట్‌ను ఐదు నిమిషాల పాటు సూర్య కిరాణాలు తాకాయి. మూల విరాట్‌ను పాదాల నుంచి శిరస్సు వరకు సూర్య కిరణాలు తాకాయి. ఈ ఆద్భుతాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. దీనిని చూసేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కృతం చూసి తమ మనస్సు పరవశించిపోయిందని, తమ జన్మ ధన్యమైందని భక్తులు చెబుతున్నారు. ఇలాంటి అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతమంటున్నారు.

సూర్యకిరాణాలు నిన్న స్వామివారిని తాకుతాయని భావించి చాలామంది భక్తులు దేవాలయానికి చేరుకున్నారు. కానీ కారు మబ్బుల కారణంగా తాకకపోవడంతో.. భక్తులు నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కానీ ఇవాళ తాకడంతో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది.

కాగా ఏడాదికి రెండుసార్లు సూర్య కిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ను తాకుతాయి. ప్రతి ఏటా మార్చి 9 లేదా 10, అక్టోబర్ 1 లేదా 2వ తేదీల్లో స్వామివారిని తాకుతాయి. ఈ అద్భుతాన్ని చూస్తే.. కంటి, చర్మ సంబంధిత వ్యాధులు రావని భక్తులు నమ్ముతారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దీనిని చూసేందుకు వస్తూ ఉంటారు.

Advertisement

Next Story