- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 31 వరకు సమ్మర్ హాలీడేస్
దిశ, తెలంగాణ బ్యూరో : పాఠశాలలకు, ఇంటర్మిడియట్ కళాశాలలకు మే 31 వరకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం చివరి ‘వర్కింగ్ డే’ (ఏప్రిల్ 26) నేటితో ముగిసినట్టుగా తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి మొదలవుతుంది, మళ్ళీ స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు ఎప్పటి నుంచి తెరుచుకుంటాయనే దానిపై జూన్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది.
ఆల్ పాస్..
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 5.21 లక్షల మంది టెన్త్ విద్యార్థుల్ని ప్రభుత్వం ’ఆల్ పాస్’ చేసింది. పరీక్షలు రాయకుండానే పాస్ అయినట్లు ప్రకటించింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న సుమారు 53.79 లక్షల మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేసినట్టుగా ఇంటర్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరంలోని 4,59,008 మంది విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి అసైన్‌మెంట్లను రాసి కళాశాలలో సమర్పించాలని సూచించారు. అసైన్‌మెంట్లను కళాశాలలో సమర్పించిన విద్యార్థులను మాత్రమే పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇంటర్ బోర్డ్ నిబంధనలు విధించింది.
వారికి పరీక్షలు ఉంటాయా.. ?
రెండవ సంవత్సరంలోని 4,73,967 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో రెండవ సంవత్సరం విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తారా లేదా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కరోనా వ్యాధి నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో వేచిచూడాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ బారిన పడి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసొలేషన్‌లో ఉన్న సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి విద్యాసంస్థల నిర్వహణ, వేసవి సెలవులు, విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయడం తదితరాలన్నింటిపై సమీక్ష చేశారు. అనంతరం వేసవి సెలవులపై అధికారికంగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. జూన్ 1వ తేదీన మళ్ళీ విద్యాశాఖ అధికారులతో సమావేశమై విద్యా సంస్థలను తిరిగి ఎప్పటి నుంచి తెరవాలి, వచ్చే విద్యా సంవత్సరాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తేవాలి తదితరాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.