- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యా సంస్థలకు వేసవి సెలవులు..
దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వరకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులకు సంబంధించి సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్, విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి వివరించారు.
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే విధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి చెప్పారు. స్కూల్స్, జూనియర్ కాలేజీలు ఎప్పుడు తెరిచేది కేసుల తీవ్రతను బట్టి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజుగా పరిగణిస్తామని మంత్రి వెల్లడించారు.