శిష్యా.. నన్ను మరో శిష్యుడిని చేశావు : సుకుమార్

by Jakkula Samataha |   ( Updated:2021-02-16 06:28:01.0  )
శిష్యా.. నన్ను మరో శిష్యుడిని చేశావు : సుకుమార్
X

దిశ, సినిమా : ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా మారిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన శిష్యుడిని అభినందిస్తూ హార్ట్ ఫెల్ట్ నోట్ రాశాడు సుకుమార్. ‘నువ్వు నన్ను గురువును చేసేసరికి.. నాకు నేను శిష్యుడినైపోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి, నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా? అనేది అర్థం కావట్లేదు.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేనేమో! నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’ బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు సుకుమార్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కొనసాగిస్తోంది.

Advertisement

Next Story