- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య తొడపై సూసైడ్ నోట్.. భర్త ఏం చేశాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : శాడిస్ట్ భర్త వేధింపులు భరించలేక ఓ ఇల్లాలు ఇల్లు వదిలి వెళ్లి సులభ్ కాంప్లెక్స్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. తాను ప్రాణాలు వదులుతూ భర్తకు శిక్ష పడేలా చేసింది. భర్త నిజస్వరూపాన్ని తెలుపుతూ తన తొడపై సూసైడ్ లేఖ రాసింది. ముంబైలో జరిగిన ఈ విషాధ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై నగరంలోని ములంద్‌కు చెందిన భాగ్యశ్రీ నర్లేకు ఏడేళ్ల క్రితం సతారా అనే వ్యక్తిని వివాహం అయింది. కొద్ది రోజులు సజావుగా సాగిన వారి సంసారానికి సాక్షిగా ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత నుంచి సతారా తన భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో సర్దుకుపోయిన భాగ్యశ్రీకి రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి వెళ్లి తండ్రితో కలిసి ఉంటుంది. ఆమెతో కుమారుడిని కూడా పంపకుండా వేధింపులకు పాల్పడ్డాడు శాడిస్ట్ భర్త. ఆమె పుట్టింటికి వెళ్లినా అతడు ఫోన్ చేసి, మెస్సేజ్‌లు చేసి నిత్యం అసభ్యపదజాలంతో మానసికంగా వేధించాడు.
భర్తను వదిలేసినా తనను ప్రశాంతంగా ఉండనివడం లేదని, తను చేసే ప్రతి పనికి అడ్డుతగులుతున్నాడని భాగ్యశ్రీ ఆవేధనకు గురింది. మరోవైపు నిన్ను, నీ కుటుంబాన్ని చంపుతానని భర్త బెదిరింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపం చెందిన భాగ్యశ్రీ నర్లే.. జనవరి 28న ఇంటి నుంచి బయటకు వెళ్లి స్థానికంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లో చున్నీతో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆమె తొడపై రాసిన సూసైడ్ నోట్ కనిపించింది. దానిలో ఆమె భర్త ఎలా వేధింపులకు పాల్పడ్డాడో రాసుకుంది. భర్తను కఠినంగా శిక్షించాలని కోరింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భార్య చనిపోయిన విషయం తెలుసుకున్న భర్త ఇల్లు వదిలి పరారీ అయ్యాడు.