బిర్యానీ కోసం… ఆత్మహత్యాయత్నం

by Sumithra |
బిర్యానీ కోసం… ఆత్మహత్యాయత్నం
X

రోజూ బిర్యానీ అడుగుతున్నా తేవడం లేదని, భర్త మీద అలిగి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్‌లో నివసించే వెంకటయ్య ప్రయివేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడు రోజులుగా అతని భార్య పద్మ28) చికెన్‌ బిర్యానీ తీసుకురావాలని భర్తను కోరుతోంది. తన మాటను పెడచెవిన పెడుతున్నాడని భావించిన పద్మ నిన్న గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుంది. చుట్టుపక్కలవారు గమనించి ‘108’ ద్వారా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శరీరానికి దాదాపు 70 శాతం కాలిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాయని, దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story