- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎరువుల వ్యాపారి చేసిన పనికి.. కుటుంబమంతా ఆత్మహత్యాయత్నం..
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉద్దెర తీసుకున్న ఎరువులకు వడ్డీపై వడ్డీ వేసి తమకు తెలియకుండానే వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం… భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన రాగం ఐల్లయ్య 2010లో రూ. 83 వేల ఎరువులు, విత్తనాలు మల్క రాజేశ్వర్ రావు అనే వ్యాపారి వద్ద ఉద్దెర తీసుకున్నాడు. అయితే కొంతకాలం క్రితం ఐలయ్య తాడిచర్ల శివారు లోని 723 సర్వే నంబర్ లో 3 ఎకరాల 20 గుంటల భూమిని వేరే వారివద్ద కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఐలయ్య కుటుంబమే సదరు భూమిలో సాగు చేసుకుంటోంది. భూమి ఐలయ్య కుటుంబ సభ్యుల పేరిట మ్యూటేషన్ చేయించుకోలేదు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పొలం చేస్తున్నట్టుగా ఉంది. వ్యాపారి రాజేశ్వర్ రావు తనకు ఇవ్వవలసిన అప్పుకు వడ్డీ జమ చేసి ఏడాది తరువాత రూ. 2లక్షలకు చేర్చారు.
దీంతో ఐలయ్య కుటుంబ సభ్యులు తమ భూమిని తనఖా పెట్టుకుని వడ్డీ అడగవద్దని కోరారు. అప్పటి నుండి వ్యాపారి రాజేశ్వర్ రావు ఆధీనంలో ఉన్న ఈ భూమి రికార్డుల్లో వేరే యజమానులు ఉన్నారన్న విషయాన్ని గమనించి ఐలయ్య కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా పేరు మార్పిడి చేయించుకున్నాడు. ఇటీవల జెన్ కో ప్రాజెక్టు నిర్మాణంతో తమ పరిహారం రావడంతో రాజేశ్వర్ రావుకు అప్పుగా ఇవ్వవల్సిన డబ్బులు తిరిగి చెల్లించేందుకు వెళితే అతను డబ్బు తీసుకోకుండా తప్పించుకుంటున్నాడు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం కనిపించలేదు. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఆ భూమి పట్టదారు పేరు మార్పించుకున్న విషయం తేలింది. దీంతో తామిచ్చే రూ. 83 వేల కోసం రూ. 80 లక్షల విలువైన స్థలాన్ని తనపేరిట మార్పించుకున్నాడని ఐలయ్య భార్య రాగం లచ్చక్క, కుమారుడు సతీష్ తో పాటు కుటుంబ సభ్యులు వ్యాపారి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని అడ్డుకుని అసలు విషయం ఏంటని ప్రశ్నించగా వారి గోడు వెల్లబోసుకున్నారు. బాధిత కుటుంబం అంతా కూడా వ్యాపారి ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారి రాజేశ్వర్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారి రాజేశ్వర్ రావు అధికార పార్టీకి చెందిన సింగిల్ విండో డైరక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వివరించారు.
నన్నూ మోసం చేశాడు…
గత ముప్పై సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నప్పటికీ తనను కూడా వ్యాపారి రాజేశ్వర్ రావు మోసం చేశాడని మరో రైతు ఆరోపించారు. బాధిత రైతు మేనం రాయమల్లు మాట్లాడుతూ… రాజేశ్వర్ రావు తనతో స్నేహంగా ఉంటూ నట్టేట ముంచాడని లబోదిబోమన్నాడు. రభీ సీజన్ లో 480 బస్తాల ధాన్యాన్ని విక్రయించగా తరుగు పేరిట 38 బస్తాల ధాన్యం కోత విధించాడని వాపోయాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరుగు పేరిట మోసం చేశాడన్నారు.