- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి : ఎమ్ఆర్ఓ ఆఫీసు ఎదుట సంచలన ఘటన
దిశ, కామారెడ్డి: ఎమ్ఆర్‌ఓ ఆఫీస్ ఎదుట సంచలన ఘటన వెలుగు చూసింది. తమ భూమిని కబ్జా చేసి రైతుబంధు, నూతన పాస్ పుస్తకాలు రాకుండా చేస్తున్నారని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తండ్రి కొడుకులు తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన పెంజర్ల మల్లారెడ్డికి కంచర్ల, పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి మల్లారెడ్డి పేరున రెవిన్యూ రికార్డులో ఉంది. అయితే మల్లారెడ్డి సొంత అన్నదమ్ములైన లక్ష్మారెడ్డి, రాంరెడ్డిలు కబ్జా చేశారు. 2018 లో మల్లారెడ్డికి చెందిన 2 ఎకరాల స్థలాన్ని కొడుకు నితిన్ రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ భూమి నితిన్ రెడ్డి, మల్లారెడ్డి పేరు మీద కొత్త పాస్ పుస్తకాలు రాకుండా రాంరెడ్డి, లక్ష్మారెడ్డిలు అధికారులకు రెండు లక్షల లంచం ఇచ్చారని బాధితులు ఆరోపించారు. గత తహసీల్దార్ సుధాకర్ రెడ్డి, ఆర్ఐ రవీందర్ రెడ్డిలు వారితో కుమ్మక్కయ్యారని తెలిపారు. అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో నేడు తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.