పవర్ స్టార్‌కు హార్ట్ఎటాక్.. పరిస్థితి విషమం

by Shyam |
పవర్ స్టార్‌కు హార్ట్ఎటాక్.. పరిస్థితి విషమం
X

దిశ, సినిమా: తమిళ యాక్టర్, డాక్టర్ పవర్ స్టార్ శ్రీనివాసన్‌ హాస్పిటల్‌లో చేరారు. హై బ్లడ్ ప్రెషర్‌తో సడెన్ హార్ట్ అటాక్ వచ్చిందని తెలిపిన బంధువులు.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌లో జాయిన్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుండగా పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ‘లతిక’ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. ‘కన్న లడ్డు, ఆర్య సూర్య, లీడర్, వళ్లవంకు పుల్లమ్ ఆయుధమ్, ఐ, వలిప రాజా’ లాంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. అయితే ఓ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ‘పికప్ డ్రాప్’ మూవీ చేస్తున్న పవర్ స్టార్.. తనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed