బిగ్‌బ్రేకింగ్ : సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్

by Anukaran |   ( Updated:2021-05-25 11:54:31.0  )
CBI
X

దిశ, వెబ్‌డెస్క్ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. జైస్వాల్ 1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన రెండేళ్ల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ఇన్ చీఫ్ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం జైశ్వాల్ సీఐఎస్‌ఎఫ్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఇదిలాఉండగా కేంద్రం ప్రతిపాదించిన ఇద్దరు అధికారుల పేర్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

cbi appointment letter

Advertisement

Next Story