- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీ నేతపై దాడికి పాల్పడ్డ సుభానీ అరెస్ట్
దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై దాడికి పాల్పడిన సుభానీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వల్ల వైసీపీకి నష్టం చేకూరుతుందంటూ సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేశారు. దీంతో సుబ్బారావుప్రాణ భయంతో ఓ లాడ్జిలో దాకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సుభానీ మరికొంతమందితో కలిసి ఆదివారం సాయంత్రం లాడ్జిలో ఉన్న సుబ్బారావు గుప్తాపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చిన రీతిలో తిడుతూ చావబాదాడు.
చంపేస్తా లేపేస్తా అంటూ రెచ్చిపోయాడు. షుగర్ ఉంది… పిల్లలున్నవాడిని వదిలెయ్యండి అని ప్రాధేయపడినా వదల్లేదు. చివరకు మోకాళ్లపై కూర్చోబెట్టి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి క్షమాపణలు చెప్పించారు. అక్కడితో ఆగిపోలేదు ఆ వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలంటూ సుభానీ దాడి చేశాడు. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. సుబ్బారావు గుప్తా ఇంటిపై, లాడ్జిలో దాడిపై సుమోటోగా 2 కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సుబ్బారావు భార్యను అడిగి దాడి వివరాలు సేకరించారు. దీంతో మంగళవారం సుభానీని అరెస్ట్ చేసినట్లు ఒంగోలు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు.