17మంది SIలకు స్థాన చలనం..

by Shyam |   ( Updated:2021-01-15 01:06:48.0  )
17మంది SIలకు స్థాన చలనం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రేంజ్ పరిధిలోని కమిషనరేట్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని 17 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ నిజామాబాద్ రేంజ్ ఐజీ పి.శివ శంకర్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 17 మంది ఎస్ఐల వివరాలు ఇలా ఉన్నాయి. సందీప్ ప్రస్తుతం ఎస్ఐ 1 నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ సంగారెడ్డి జిల్లాలో పని చేస్తుండగా ఆయనను ఎస్సై 1 గా 4 పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు, లక్ష్మయ్య నాలుగోవ పీఎస్ ఎస్ఐ ఒకటిగా ఉన్న ఆయన్ను వీఆర్ నిజామాబాద్ కమిషనరేట్, సంతోష్ కుమార్ ఆర్ వి ఆర్ మెదక్ జిల్లా నుంచి ఎస్‌హెచ్ ఓ కొండాపూర్ పోలీస్ స్టేషన్ సంగారెడ్డి జిల్లాకు, రాజు కొండాపూర్ పీఎస్ సంగారెడ్డి జిల్లా నుంచి విఆర్ సంగారెడ్డి జిల్లాకు, అహ్మద్ మోహినుద్దీన్ విఆర్ కామారెడ్డి జిల్లా నుండి ఎస్సై 2 బిక్నూర్ పోలీస్ స్టేషన్ కామారెడ్డి జిల్లాకు, రాజు ఎస్హెచ్ఓ రామారెడ్డి పోలీస్ స్టేషన్ కామారెడ్డి జిల్లా నుంచి ఎస్‌హెచ్‌వో మద్నూర్ పీఎస్ కామారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అదేవిధంగా మరో 11 మంది ప్రభాకర్ ఆర్ఎస్ఐ 12 పోలీస్ స్టేషన్ నిజామాబాద్‌లో విధులు నిర్వహించగా ఆయన్ను ఎస్ఐ 1 భీంగల్ పీఎస్ నిజామాబాద్‌కు, సాయినాథ్ విఆర్ నిజామాబాద్ కమిషనరేట్ నుంచి ఇఎస్‌ఐ 1 రెండో పోలీస్ స్టేషన్ నిజామాబాద్‌కు బదిలీ చేశారు. శ్రీధర్ రెడ్డి ఎస్సై 1 భీంగల్ పోలీస్ స్టేషన్ నుంచి మెండోరా పోలీస్ స్టేషన్‌కు, సురేష్ ఎస్‌హెచ్వో మెండోరా పోలీస్ స్టేషన్ నుంచి సీఎస్ఐ చర్చ్ మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌కు, సంపత్ కుమార్ ఎస్‌ఎస్‌ఓ మోర్తాడ్ పీఎస్ నుంచి విఆర్ సిద్దిపేట్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. శ్రీధర్ గౌడ్ ఎస్‌హెచ్‌ఓ వేల్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్‌హెచ్‌వో కమ్మర్పల్లి పీఎస్‌కు, ఎండీ ఆసిఫ్ కమ్మర్ పల్లి పీఎస్ నుంచి ఎస్‌హెచ్‌వో ఏరుగట్ల పోలీస్ స్టేషన్‌కు, హరిప్రసాద్ ఎస్‌హెచ్వో ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నుంచి ఎస్‌హెచ్ ఓ ముప్కల్ పీఎస్‌కు, రాజు భరత్ ఎస్‌హెచ్వో ముప్కల్ నుంచి డీఎస్‌హెచ్‌వో వేల్పూర్ పోలీస్‌స్టేషన్‌కు, రాజశేఖర్ ఎస్‌హెచ్‌వో మద్నూర్ పీఎస్ కామారెడ్డి జిల్లా నుంచి ఇఎస్‌హెచ్‌ఓ బాల్కొండ పోలీస్‌స్టేషన్‌కు బదిలీఅయ్యారు. శ్రీహరి బాల్కొండ పీఎస్ నుంచి విఆర్ నిజామాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేస్తూ ఐజీపీ శివ శంకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed