అంతరిక్షం నుంచి రాత్రి, పగలు..

by Harish |
అంతరిక్షం నుంచి రాత్రి, పగలు..
X

రాత్రి, పగలును ఒకేసారి చూసే అదృష్టం కేవలం ఒక్కరికే ఉంటుంది. భూమికి దూరంగా.. సుదూర విశ్వంలో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తున్న వ్యోమగాములకే ఈ అవకాశం ఉంటుంది. అలాంటి అద్భుతమైన సుదృశ్యాన్ని అందరూ చూడగలిగే అవకాశాన్ని ‘రాబర్ట్ ఎల్ బెన్‌కెన్’ కల్పించారు. అవును.. రాత్రీపగలు మధ్య సరిహద్దు విభేదాన్ని చూపించే ఫొటోను ఒకదాన్ని ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో అన్ని సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారుతోంది.

‘మన గ్రహాన్ని చూడటంలో నాకు చాలా ఇష్టమైన వీక్షణ’ అంటూ బాబ్ ట్విట్టర్ హ్యాండిల్‌ పేరుతో రాబర్ట్ ట్వీట్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోల్లో భూగ్రహం ఒక భాగం పూర్తిగా చీకటిగా ఉండటం, మరో భాగం వెలుతురుతో ఉండటం చూడొచ్చు. రాబర్ట్ ఈ ఫొటోను షేర్ చేయగానే 59,100 లైకులు, 8,400 రీట్వీట్‌లు వచ్చాయి. ఇక ఈ వీక్షణను పొగుడుతూ ఎంతో మంది కామెంట్లు చేశారు. ప్రస్తుతం రాబర్ట్ జాయింట్ ఆపరేషన్స్ కమాండర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Next Story