రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం(1802-05) (ఇండియన్ హిస్టరీ)

by Harish |
రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం(1802-05) (ఇండియన్ హిస్టరీ)
X

బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - లార్డ్‌ వెల్లస్లీ

ఒకటో బాజిరావు కాలంలో మరాఠాలు అనేక సర్ధారులుగా విడిపోయారు.

1) పూణె. - పీష్వాలు

2) నాగ్‌పూర్‌ - బోంస్లేలు

3) గ్వాలియర్‌ - సింధియాలు

4) ఇండోర్‌ - హోల్కారులు

5) బరోడా - గైక్వాడ్‌లు

బస్సైన్ ఒప్పందంతో 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఆరంభం:

1802లో ఇండోర్‌ పాలకుడు జస్వంత్‌రావు హోల్కార్‌ పూణే వద్ద 2వ బాజిరావును కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఓడించాడు.

దీనికి ప్రతీకారం తీర్చుకొనుటకు పీష్వా 2వ బాజిరావు బ్రిటీష్‌ సహాయాన్ని అర్జిస్తూ బస్సైన్‌ అనే ఒప్పందంపై సంతకం చేశాడు.

దీంతో 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఆరంభమైంది.

బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ ఇద్దరు జనరల్స్‌ను (ఆర్ధర్‌ వెల్లస్లీ, లేక్‌) మరాఠాపైకి పంపాడు.

ఆర్ధర్‌ వెల్లస్లీ నాగ్‌పూర్‌పై దాడిచేసి బోంస్లేలను ఓడించి వారిచే 'డియోగం' అనే ఒప్పందంపై సంతకం చేయించాడు.

ఈ ఒప్పందం ప్రకారం బోంస్లేలు కటక్‌, బాలాసోర్‌, వార్థా నది పశ్చిమాన ఉన్న భూభాగాన్ని బ్రిటీష్‌కు ఇచ్చారు.

జనరల్‌ లేక్‌ గ్వాలియర్‌పై దాడిచేసి సింధియాలను ఓడించి వారిచే సుర్జీ అర్జనగామ్‌ అనే ఒప్పందంపై సంతకం చేయించాడు.

ఈ ఒప్పందం ప్రకారం సింధియాలు జైపూర్‌, జోధ్‌పూర్‌, గోహాధ్‌ కోటలను, గంగా యమున నదుల మధ్య ఉన్న భూభాగాన్ని బ్రిటీష్‌కు ఇచ్చారు.

ఇండోర్ పై దాడులు:

తర్వాత జస్వంత్‌రావు హోల్కార్‌పై (ఇండోర్‌) బ్రిటీష్‌ వారు దాడులు చేశారు. కానీ జస్వంత్‌రావు హోల్కార్‌, భరత్‌పూర్‌ రాజు బ్రిటీషు వారి దాడులను తిప్పికొట్టారు.

1805 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే రాజ్‌ఘాట్‌ అనే ఒప్పందం ప్రకారం 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైంది.

2వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు:

బస్పైన్స్‌ ఒప్పందం - 1802

డియోగాం - 1803

సుర్జీ అర్జనగామ్‌ - 1803

రాజ్‌ఘాట్‌ - 1805

Advertisement

Next Story

Most Viewed