- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సహాయ నిరాకరణోద్యమం: (ఇండియన్ హిస్టరీ గ్రూప్స్ ..స్పెషల్ )
గాంధీయుగం
భారత రాజకీయాలలో పరిస్థితులకు తగిన విధంగా మారే వ్యక్తిత్వం గాంధీకి అనుకూలించింది.
ప్రజల నాడిని అంచనా వేయడంలో పరిణితి చెందాడు.
సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని నిర్వహించిన అనుభవమున్న ఒకే ఒక నాయకుడు గాంధీజీనే..
గాంధీజీ తన తొలి ఉద్యమాన్ని చంపారన్, కేథ్, అహ్మదాబాద్ మిల్లు కార్మికులతో నడిపాడు.
శ్రామిక వర్గాలకు సంరక్షకునిగా పిలవబడిన గాంధీజీ హింసను వ్యతిరేకించటం వలన భూస్వామ్య, పెట్టుబడిదారి వర్గాలకు నాయకుడయ్యాడు.
రామరాజ్యం ప్రస్తావించుట వలన సనాతన హిందువుల దృష్టిని ఆకర్షించిన గాంధీ ఖిలాఫత్ సమస్యను ప్రస్తావించి ముస్లింలకు నాయకునిగా గుర్తించబడ్డాడు.
వైవిధ్య భావాల మధ్య సమతుల్యాన్ని పాటించే గాంధీజి వ్యక్తిత్వం కాంగ్రెస్‌లో ఇతడి ఆధిపత్యానికి దారితీసింది.
మాటలలో మితవాది గాను, చేతలలో అతివాదిగానూ గాంధీ కాంగ్రెస్‌లోని ఇరు వర్గాలకు నాయకుడయ్యాడు.
గాంధీ యుగంలో మొట్ట మొదటి, జాతీయోద్యమంలో రెండవ పోరాటమైన సహాయ నిరాకరణోద్యమానికి కారణాలు మొదటి ప్రపంచ యుద్ధంతో ముడిపడి ఉన్నాయి.
1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది.
యుద్ధం కారణంగా పెంచబడిన భూమిశిస్తు రైతాంగానికి భారమైంది.
ఆర్థిక మాంద్యం వలన పరిశ్రమలు మూతపడ్డాయి.
కార్మికులలో అశాంతి చోటు చేసుకుంది.
రోజురోజుకు బలపడుతున్న విప్లవ వాదం నుండి కాపాడుకొనుటకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై జస్టిస్ రౌలత్ కమిటీని నియమించింది.
మానవ హక్కులను హరించే విధంగా రౌలత్ కమిటీ నాలుగు చట్టాలను ప్రతిపాదించింది.
చట్టాలు దుర్వినియోగం పరచబడతాయని కాంగ్రెస్ నాయకత్వం ఆందోళనకు గురైంది.
ఏప్రిల్ 6, 1919 రౌలత్ చట్టం నిరసన దినంగా పాటించాలని గాంధీ పిలుపునిచ్చాడు.
పంజాబ్‌లో ఆందోళన వలన మిలటరీ ప్రభుత్వం జనరల్ డయ్యర్ నాయకత్వంలో అరాచకాలకు పాల్పడింది.
ఏప్రిల్ 13,1919 అమృత్‌సర్ పట్టణంలో జలియన్ వాలా బాగ్ సామూహిక హత్యాకాండ చోటు చేసుకుంది.
పంజాబ్ దురాగతాలకు భాద్యుడైన డయ్యర్‌ను శిక్షించాలని అనడం మరో కారణమైంది.
1919 మాంటేగ్ చేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు స్వయం పరిపాలనకు బదులు ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
దీంతో స్వయం పరిపాలన ఉద్యమం వైపు అడుగులు పడ్డాయి.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్యారిస్ శాంతి సమావేశంలో ఖలీఫా వ్యవస్థను రద్దు చేస్తామని ఆంగ్లేయులు ప్రకటించారు.
ఖలీఫా వ్యవస్థ పరిరక్షణకు సోదరులైన మౌలానా మహ్మద్ అలీ, షౌకత్ అలీలు అఖిల భారత ఖిలాఫత్ కమిటీ స్థాపించారు.
ఢిల్లీలో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో గాంధీ ఖిలాఫత్ సంఘం అధ్యక్షునిగా ప్రకటించబడ్డాడు.
ఉద్యమ ఫలితాలు:
ఉద్యమం తాను ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.
రౌలత్ చట్టాలు కొనసాగినాయి.
కార్మిక, కర్షక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలాయి.
పంజాబ్ దురాగతాలకు బాధ్యుడైన జనరల్ డయ్యర్ నిర్దోషి అని హంటర్ కమిటీ విచారణ సంఘం ప్రకటించింది.
స్వయం పరిపాలనకు బదులు ద్వంద్వ ప్రభుత్వం కొనసాగింది.
ఏ ఖలీఫా పరిరక్షణకైతే ఉద్యమం ప్రారంభమైందో ఆ ఖలీఫా వ్యవస్థను టర్కీ ప్రజలే రద్దు చేసుకున్నారు.
ఆశించిన ఫలితాలు సాధించకపోగా ప్రతికూల ఫలితాలు చోటుచేసుకున్నాయి.
గాంధీ ఉద్యమాన్ని రద్దు చేయడంతో కాంగ్రెస్‌లో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి.
దీంతో సి.ఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, విఠల్ బాయ్ పటేల్ ఆధ్వర్యంలో స్వరాజ్ పార్టీ ఏర్పడింది.
గాంధీ ఉద్యమం నిలిపివేయడంతో గాంధీకి ఆలీ సోదరులు మధ్య తీవ్ర అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి.
ఉద్యమ వైఫల్యానికి ఆలీ సోదరులు గాంధీని తప్పు పట్టారు.
అప్పటి నుండి ముస్లింలు కాంగ్రెస్‌తో కలిసి జాతీయోద్యమంలో పాల్గొనలేదు.
ఉద్యమం తన ఆశయ సాధనలో విఫలమైనప్పటికీ కొన్ని చెప్పుకోదగిన విజయాలు సాధించింది.
ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్వహించి కలిగిన విప్లవ పార్టీగా అవతరించింది.
కార్మికులు, కర్షకులు మొదటి సారిగా స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు.
ఉద్యమం పోకడలు
1920 నాగ్‌పూర్ కాంగ్రెస్ సమావేశం గాంధీని ఉద్యమానికి నాయకునిగా ప్రతిపాదించింది.
స్వదేశీ, స్వరాజ్, సంపూర్ణ బహిష్కరణ, పన్నుల నిరాకరణ ఉద్యమ ప్రణాళికలు గాంధీ ప్రకటించాడు.
మద్రాస్ ప్రెసిడెన్సీలో చీరాల పేరాల, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమాలు నిర్వహించబడ్డాయి.
గిరిజన తెగలైన చెంచులు అడవి చట్టాలకు వ్యతిరేకంగా కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో పల్నాడు అడవి సత్యాగ్రహం నిర్వహించారు.
గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో కోయలు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఉద్యమించారు.
స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఖాదీ వస్త్రాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
దీంతో రాట్నం ఉద్యమంలో భాగమైంది.
సంపూర్ణ బహిష్కరణలో భాగంగా బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు కార్యాలయాలు బహిష్కరించబడ్డాయి.
ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు ప్రభుత్వం వేల్స్ రాకుమారుడు భారతదేశ పర్యటనకు వస్తాడని ప్రకటించింది.
ఠాకూర్ సింగ్ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ వ్యతిరేకోద్యమాన్ని ప్రారంభించింది.
ఉద్యమ గమనంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆలీ సోదరులు పట్టుబడటంతో గాంధీకి ఆలీ సోదరుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి.
1921లో కేరళలోని మలబారు తీరంలోని మోప్లా అను ముస్లిం రైతు కూలీలు నంబూద్రి భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
ఇది చివరికి హిందూ ముస్లిం మత కలహంగా మారింది.
మీరట్, లక్నో, ఖాన్‌ఫూర్‌లలో మతకాలహాలు చోటు చేసుకున్నాయి.
1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జిల్లాలో చౌరిచౌర సంఘటన చోటు చేసుకుంది.
ఉద్యమంలో హింస చెలరేగడంతో ఫిబ్రవరి 11న గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేశారు.