ఇండియన్ పాలిటీ: రాజ్యసభ నిర్మాణం

by Harish |
ఇండియన్ పాలిటీ: రాజ్యసభ నిర్మాణం
X

పార్లమెంట్ అనగా లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి.

రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం.

ఒక బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.

రాజ్యసభ నిర్మాణం:

ఆర్టికల్ 80: రాజ్యసభ గురించి పేర్కొంటుంది.

రాజ్యసభకు ఉన్న వివిధ పేర్లు: ఎగువసభ, మేధావుల సభ, రాష్ట్రాల పరిషత్, రాష్ట్రాల మండలి.

రాజ్యసభ సభ్యుల సంఖ్య: 250(గరిష్టం)

రాజ్యసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 245, వీరిలో రాష్ట్రాల నుండి 229, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పాండిచ్చేరి నుండి 4, రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేస్తారు.

కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ రంగాలలో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.

సభ్యుల అర్హత:

భారతీయుడై ఉండాలి.

30 ఏళ్ల వయసుండాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండరాదు.

ఒక వేళ ఉంటే రాజీనామా చేయాలి.

సొంత రాష్ట్రం అయి ఉండవలసిన అవసరం లేదు.

రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాలు:

రాష్ట్రం సభ్యులు

1. ఉత్తరప్రదేశ్ 31

2. మహారాష్ర్ట 19

3. తమిళనాడు 18

4. పశ్చిమ బెంగాల్ 16

5. బీహార్ 16

6. కర్ణాటక 12

7. ఆంధ్రప్రదేశ్ 11

8. మధ్యప్రదేశ్ 11

9. గుజరాత్ 11

రాజ్యసభలో ఒకే సభ్యుడున్న రాష్ట్రాలు:

అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, గోవా, మేఘాలయ, సిక్కిం, త్రిపుర.

కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా రాజ్యసభ స్థానం ఒకటి.

అలాగే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(డీఎల్)కి రాజ్యసభలో 3 స్థానాలున్నాయి.

రాజ్యసభలో తెలంగాణ, అసోం, పంజాబ్‌లకు 7 స్థానాలున్నాయి.

సభ్యుల పదవీకాలం:

రాజ్యసభ సభ్యుల పదవీకాలం సాధారణంగా 6 ఏళ్లు.

ప్రతి 2 ఏళ్లకు 1/6 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా.. తిరిగి అంతే సభ్యులు నియామకం అవుతారు.

రాజ్యసభ పదవి కాలం శాశ్వతం. రాజ్యసభ శాశ్వత సభ. దీనిని ఎవరూ రద్దు చేయలేరు.

రాజ్యసభను శాశ్వత సభ, నిరంతర సభ, పాత కొత్తల మేళవింపు అని పిలుస్తారు.

రాజ్యసభ ప్రత్యేకతలు:

రిజర్వేషన్లు ఉండవు.

నియోజకవర్గాలు ఉండవు.

రాష్ట్ర నివాసి కానవసరం లేదు.

రాజ్యసభ నుండి మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి లోక్‌సభకు బాధ్యత వహించాలి.

మంత్రిగా ఉండేది ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ప్రభుత్వం అధికారంలో ఉండేది లోక్‌సభ విశ్వాసం ఉన్నంతవరకే.

Advertisement

Next Story