- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ పాలిటీ: ప్రాథమిక హక్కులు
రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరిచారు.
దీనిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటున్నాయి.
ప్రపంచంలో తొలిసారిగా ప్రాథమిక హక్కుల గురించి పేర్కొన్నది- ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ ఎడ్వర్ట్.
1215 లో జాన్ ఎడ్వర్డ్ తొలిసారిగా ప్రజలకు కొన్ని హక్కులను కల్పించాడు. దీనినే హక్కుల పత్రం అంటారు.
ఈ హక్కుల పత్రాన్ని మాగ్నా కార్టా అని పిలుస్తారు.
అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ పేరుతో ప్రాథమిక హక్కులు పొందుపరిచారు.
1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన చేసింది.
ప్రాథమిక హక్కులు- భారతీయుల కృషి:
అనిబిసెంట్ తన కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో ప్రాథమిక హక్కుల గురించి పేర్కొన్నది.
1931 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కరాచీ సమావేశంలో తొలిసారిగా ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంది.
గాంధీజీ యంగ్ ఇండియా పత్రికలో ప్రాథమిక హక్కుల గూర్చి ప్రస్తావించాడు.
రాజ్యాంగ పరిషత్ లో ప్రాథమిక హక్కుల కమిటీకి అధ్యక్షుడు - మోతీలాల్ నెహ్రూ
ప్రాథమిక హక్కులను అమలు చేసే బాధ్యత - ప్రభుత్వాలది.
ఈ హక్కులను సంరక్షించే బాధ్యత - న్యాయస్థానాలది.
ప్రాథమిక హక్కులు రకాలు:
1. సమానత్వపు హక్కు (14 -18)
2. స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కు (19 -22)
3. పీడనాన్ని నిరోధించే హక్కు (23 -24)
4. మత స్వాతంత్రపు హక్కు (25-28)
5. విద్యా సాంస్కృతిక హక్కు (29-30)
6. ఆస్తి హక్కు(31 ఎ) (44వ సవరణ ద్వారా దీనిని తొలగించారు)
7. రాజ్యాంగ పరిహార హక్కు (32)
గమనిక: రాజ్యాంగం ప్రారంభంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కును తొలగించి, 12వ భాగంలో 300(ఎ) ఆర్టికల్ వద్ద చట్టబద్దమైన హక్కుగా చేశారు.
ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి.
ఆర్టికల్ 12: రాజ్యం గురించి నిర్వచిస్తుంది.
హక్కులను అమలు చేసేది రాజ్యం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర..రాష్ట్ర చట్టసభలు, స్థానిక సంస్థలు ..ఇతర సంస్థలు రాజ్యం కిందకు వస్తాయి.
రాజ్యం కిందకు రానివి:
బిసిసిఐ
ఎన్ సీఈఆర్ టీ
సహకార సంఘాలు..
న్యాయ వ్యవస్థ రాజ్యం కిందకు వస్తుందా..? రాదా..?
న్యాయవ్యవస్థ న్యాయపరమైన విధులు లేదా తీర్పులు చెప్పేటప్పుడు రాజ్యం కిందకు రాదు.
కానీ కోర్టు తన సిబ్బందిని నియమించుకునేటప్పుడు కార్యనిర్వహక విధులు నిర్వహిస్తుంది..ఆ సమయంలో రాజ్యం కిందకు వస్తుంది.
ఆర్టికల్ 13: రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న చట్టాలు చెల్లనేరవు.
నోట్: న్యాయ సమీక్ష అనే పదం ప్రత్యక్షంగా రాజ్యాంగంలో ఎక్కడా లేదు కానీ పరోక్షంగా 13వ నిబంధనలో ఉంటుంది.
సమానత్వపు హక్కు (14-18):
ఆర్టికల్ 14: చట్టం ముందు అందరూ సమానులే.
ఆర్టికల్ 15: కుల, మత, జాతి, లింగ, జన్మ వంటి 5 రకాల వివక్షతలు పాటించరాదు.
ఆర్టికల్ 16: కుల, జాతి, మత, లింగ, జన్మ, వంశం, నివాసం ఆధారంగా సామాజిక అవకాశాలలో వివక్షత చూపరాదు.
ఆర్టికల్ 17: అస్పృశ్యత నిషేధం
ఆర్టికల్ 18: బిరుదులు నిషేధం
ఆర్టికల్ 14:
ఇది రెండు రకాలుగా ఉంటుంది.
1. చట్టం ముందు అందరూ సమానులే..
ఈ భావన బ్రిటీష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
ఇది సమన్యాయం అనే భావనను సూచిస్తుంది.
సమన్యాయం అనే భావనను తొలిసారిగా వాడినది - ఏవీ డైసీ.
2. చట్టం మూలంగా సమానత్వం:
ఈ భావన అమెరికా రాజ్యాంగానిది.
సమాన హోదా కలిగిన వ్యక్తులలో ఒకే రకమైన చట్టం, అసమాన హోదా కలిగిన వ్యక్తుల్లో మరో రకమైన చట్టాలు అమలు చేయవచ్చు.
కానీ వర్గీకరణ లక్ష్యం సమానత్వమై ఉండాలి.
మినహాయింపు:
ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ లపైన క్రిమినల్ కేసు వేయరాదు.
కానీ సివిల్ కేసు వేయాలంటే 2 నెలల ముందు నోటీసు ఇవ్వాలి.
ఆర్టికల్ 15: జాతి, కుల, మత, లింగ, జన్మ వంటి వివక్షత పాటించరాదు.
మినహాయింపులు:
15(3): మహిళలకు, చిన్నపిల్లలకి మినహాయింపులు ఇవ్వవచ్చు.
ఉదా: అంగన్ వాడీలలో కేవలం మహిళా టీచర్లే ఉండటం.
15(4): విద్యా పరంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు కల్పిస్తుంది..
15(5): ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వవచ్చు.
ఆర్టికల్ 16:
కుల, జాతి, మత, లింగ, జన్మ, వంశం, నివాసం ఆధారంగా సామాజిక అవకాశాలలో వివక్షత చూపరాదు.
16(3) వెనుకబడ్డ కొన్ని ప్రాంతాలకు (నివాస ప్రాంతం) ప్రత్యేక మినహాయింపు ఇవ్వవచ్చు.
371(డి): రాష్ట్రపతి, ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వెనుకబడింది అని భావిస్తే ఆ ప్రాంతానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వవచ్చు.
16(4): సామాజిక పరంగా విద్య పరంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపు కల్పించవచ్చు.
16(4 ఎ): ఎస్సీ, ఎస్టీ వర్గానికి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు.
16(4బి): పోస్టులను కేటాయించిన వర్గంలో అర్హులు లేక భర్తీ కాకపోతే.. తిరిగి ఆయా పోస్టులను ఆ వర్గం వారి నుంచే మరో నోటిఫికేషన్ ద్వారా (బ్యాక్ లాగ్)భర్తీ చేయాలి.
16(5): ఒక వృత్తిని ఒక మతంకే కేటాయించవచ్చు (మత ధార్మిక సంస్థలు)
ఆర్టికల్ 17: అస్పృశ్యత నిషేధం:
దీని అమలుకు ప్రభుత్వం 1955 అస్పృశ్యత నేర చట్టం చేసింది.
దీనిని 1976 పౌర హక్కుల చట్టం గా మార్చారు.
ఆర్టికల్ 18: బిరుదులు నిషేధం:
రాజ్ బహదూర్, జంగ్ బహదూర్ వంటి బిరుదులు నిషేధం.
మినహాయింపులు: విద్య, సైనిక సంబంధ మైన పురస్కారాలు.. పేర్ల ముందు ధరించవచ్చు.
భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు పురస్కారాలే కాని బిరుదులు కావు.
వీటిని పేర్ల ముందు ధరించరాదు.
విదేశాలు ఇచ్చే అవార్డులు రాష్ట్రపతి అనుమతితోనే స్వీకరించాలి.
- డా.బి ఎస్ ఎన్ దుర్గా ప్రసాద్, తక్షశిల ఐఏఎస్ అకాడమీ.