- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబం (సోషియాలజీ గ్రూప్ - 2 స్పెషల్ )
కుటుంబం ఒక విశిష్ఠ సంస్థ. వివిధ పరిస్థితులు, సందర్భాలను బట్టి కుటుంబం వ్యక్తిగతమైనదిగా లేదా ప్రజలకు సంబంధించినదిగా మారుతూ ఉంటుంది. మన జీవితంలో అధిక భాగం కుటుంబంతోనే గడుస్తుంది.
అన్ని రకాల మానవ సమూహాలలో అతి ప్రధాన మైన ప్రాథమిక సమూహమే కుటుంబం. మానవ సామాజిక జీవితానికి పునాది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థకు వివాహం పునాది వేస్తుంది.
వివాహం లాగే కుటుంబ వ్యవస్థ విశ్వజనీనమైనది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు.
వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ఈ ప్రపంచంలోని ప్రతీ వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు.
కుటుంబం ఒక కేంద్ర బిందువు. దీని చుట్టూనే మన మొత్తం జీవితం తిరుగుతూ ఉంటుంది. మనం మన దినచర్య కుటుంబ సభ్యులతో ప్రారంభిస్తాం.
ఫ్యామిలీ అనే పదం రోమన్ పదం అయిన ఫాములస్ అనే పదం నుండి ఏర్పడింది.
ఫాములస్ అనగా సేవకుడు అని అర్థం.
ఫ్యామిలీ అనే పదం ఫెమీలియా అనే లాటిన్ పదం నుండి ఏర్పడిందనేది కొందరి శాస్త్రవేత్తల అభిప్రాయం.
ఫెమీలియా అనగా : కుటుంబం.
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం : మే 15
కుటుంబం అనేది - భార్య, భర్త, వారి సంతానం.
19వ శతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబ వ్యవస్థ ఉందా అనే చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది. ఏంగెల్స్, కార్లమార్క్స్, మోర్గాన్ వంటి శాస్త్రవేత్తలు కుటుంబం ఒక పరిణామ క్రమంలో బలపడిన బంధంగా భావించారు.
సామాజికంగా ఆమోదించబడిన ఇద్దరు స్త్రీ, పురుషులు ప్రత్యుత్పత్తి లేదా జీవ వ్యవస్థను కుటుంబం అంటారు.
స్త్రీ, పురుషులు ఒకే ప్రదేశంలో నివసించడం వల్ల కుటుంబాలు ఏర్పడినాయి. అని మోర్గాన్ అనే సామాజిక వేత్త అభిప్రాయపడ్డారు.
కుటుంబం - నిర్వచనాలు:
తొలి నిర్వచనాలు:
1955 కు ముందు కాలం నిర్వచించిన కుటుంబ నిర్వచనాలని తొలి నిర్వచనాలని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలు అని పేర్కొంటారు.
1. రాబర్డ్ హెచ్. లూయి:
వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానాల మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం.
2. రాల్ఫ్ లింటన్:
వివాహం, తల్లిదండ్రుల విధులు - బాధ్యతలు , వారి సంతానం కలిసి నివసించడమే కుటుంబం.
కుటుంబం ఉనికి సర్వ సాధారణమైనది. అని లూయి, లింటన్ అభిప్రాయం.
3. జార్జి పీటర్ ముర్డక్:
192 సమాజాలను పరిశీలించిన మానవ శాస్త్ర వేత్త.
ఒకే చోట నివసించడం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండే సమూహం.
ఆధునిక నిర్వచనాలు:
1. లీచ్: వివాహం, చట్టపరమైన పితృత్వ, మాతృత్వాలు, దంపతులు పరస్పరం ఒకరిపై మరొకరు లైంగిక పరమైన ఆధిపత్యాన్ని కలిగి ఉండటమే కుటుంబం.
2. మెల్ ఫోర్డ్, స్థిత్ గ్రీన్, ప్రిన్స్ మీటర్, కాథరిన్ గఫ్:
ప్రాథమిక బంధువర్గ సమూహం.
ఇది లైంగిక, ప్రత్యుత్పత్తి, ఆర్థిక విద్యాపరమైన విధుల్ని నిర్వహించేది కుటుంబం.
3. స్టీఫెన్స్:
వివాహ ఒప్పందం 4 ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.
1. భార్యాభర్తల మధ్య ఉండే పరస్పర సంబంధం.
2. కలిసి నివసించడం
3. తల్లిదండ్రుల హక్కులు, బాధ్యతలు.
వట్టిపల్లి శంకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ