- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొట్ట మొదటి జాతీయవాది టిప్పుసుల్తాన్ (ఇండియన్ హిస్టరీ - గ్రూప్స్ స్పెషల్)
టిప్పు సుల్తాన్ బిరుదు - మైసూర్ పులి
ఇతను మొట్టమొదటి జాతీయవాది
టిప్పు సుల్తాన్ చిహ్నం - పులి
టిప్పు సుల్తాన్ అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
రైతులు అధికంగా లబ్ధి పొందారు. కొత్త క్యాలెండర్, కొత్త నాణెములను ప్రవేశపెట్టాడు.
మైసూరు ప్యాలెస్ దగ్గర శ్రీరంగనాథ దేవాలయంను నిర్మించాడు.
శృంగేరి వద్ద శారదాదేవి ఆలయ నిర్మాణం కొరకు నిధులను అందించాడు.
స్వేచ్చకు గుర్తింపుగా తన రాజధాని శ్రీరంగ పట్టణంలో ఒక వృక్షాన్ని నాటాడు.
దీనినే ట్రీ ఆఫ్ లిబర్టీ లేదా “స్వేచ్భా వృక్షం” అంటారు.
బ్రిటీషు వారిని భారతదేశం అంతటి నుంచి తరిమివేయాటానికి రాయబారులను ఫ్రాన్స్, ఈజిప్టు (1వ అబ్దుల్ హమీద్), అరేబియా, ఆఫ్ఘనిస్థాన్(జమాన్ షా దురానీ)లను పంపాడు.
టిప్పుసుల్తాన్ ఫ్రెంచి యొక్క జాకోబిన్ క్లబ్ లో సభ్యుడు (రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసే సంస్థ)
వర్తకాన్ని అభివృద్ధి చేయడానికి, ఈజిప్టులకు రాయబారులను పంపాడు.
3వ ఆంగ్లో మైసూరు యుద్ధం(1790-92):
బ్రిటీష్ గవర్నర్ జనరల్ - కారన్ వాలీస్
1790లో టిప్పుసుల్తాన్ ట్రావెన్‌కోర్‌పై దాడి చేశాడు. ట్రావెన్‌కోర్ సార్వభౌమత్వానికి బ్రిటీష్ రక్షణ కల్పిస్తుంది.
దీని కారణంగా అప్పటి గవర్నర్ జనరల్ కారన్‌వాలీస్ మైసూరుపై యుద్ధం ప్రకటించాడు.
జనరల్ మెడో మైసూరు పైకి పంపబడ్డాడు. జనరల్ మెడో టిప్పుసుల్తాన్ సైన్యమును అనేక చిన్న చిన్న యుద్ధాలలో ఓడించాడు.
1792లో టిప్పుసుల్తాన్ తన పరాజయాన్ని అంగీకరించి శ్రీరంగపట్టణం అనే ఒప్పందంపై సంతకం చేశాడు
అంశాలు:
1) టిప్పు తన సగ రాజ్యాన్ని కోల్పోయాడు
2) 3.30 కోట్ల రూపాయలు బ్రిటీష్‌కు ఇచ్చుటకు టిప్పు అంగీకరించాడు.
3) తన ఇద్దరు కుమారులను బ్రిటీష్ ఆస్థానానికి బందీలుగా పంపుటకు అంగీకరించాడు.
4వ ఆంగ్లో మైసూరు యుద్ధం(1799):
గవర్నర్ జనరల్ - వెల్లస్లీ
ఫ్రెంచి సైన్యం మైసూరులోకి ప్రవేశించినది అనే నెపంతో టిప్పుపై యుద్ధం ప్రకటించి వెల్లస్లీ జనరల్ స్టువర్ట్‌ను మైసూరు పైకి పంపాడు.
1799లో శ్రీరంగపట్టణం యుద్ధంలో స్టువర్ట్ టిప్పుసుల్తాన్‌ను వధించాడు. దీంతో మైసూరు బ్రిటీష్ ఆధీనంలోకి వచ్చింది.
టిప్పు ఖడ్గాన్ని బ్రిటీషువారు తీసుకెళ్లారు.
టిప్పు మరణం తర్వాత బ్రిటీషువారు వడయార్ వంశానికి చెందిన 3వ కృష్ణరాజ అనే 5 ఏళ్ల బాలుడిని మైసూరు సింహాసనంపై కూర్చోబెట్టారు.
ఇతని ప్రధాన మంత్రి పూర్ణయ్య.
అప్పటి మైసూర్ బ్రిటీష్ రెసిడెంట్ అధికారి బ్యారీ క్లోజ్.
1832లో విలియం బెంటిక్ మైసూర్‌ను ఆక్రమించాడు.
1882లో లార్ట్‌రిప్పన్ మైసూర్‌ను వడయార్ కుటుంబానికి తిరిగిఇచ్చాడు. అప్పటి మైసూర్ పాలకుడు చామరాజా.
ఇతని తర్వాత కృష్ణరాజ-IV పాలకుడు అయ్యాడు. ఇతని ప్రధానమంత్రియే మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
1947లో జయచామరాజ వడయార్ మైసూర్‌ను భారత్‌లో విలీనం చేశాడు.
వడయార్ వంశంలో ఉన్న చివరి వ్యక్తి నరసింహరాజ వడయార్ 2013లో మరణించాడు.
ఇతని భార్య ప్రమోదాదేవి యుద్ధవీర్ కృష్ణ దత్త చామరాజ వడయార్‌ను దత్తకు తీసుకుని వడయార్ వారసునిగా ప్రకటించింది.