- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధునిక భారతదేశ పితామహుడు.. రాజా రామ్మోహన్ రాయ్ (ఇండియన్ హిస్టరీ)
19 శతాబ్దం ఆరంభంలో భారతదేశంలో అనేక మూఢవిశ్వాసాలు, దురాచారాలు ఉన్నాయి.
మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు చేసిన ఉద్యమాలను సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలంటారు.
ప్రజలను చైతన్య వంతులను చేయడం కోసం ఉద్యమాలను చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి - రాజారామ్మోహన్‌రాయ్
రాజారామ్మోహన్‌రాయ్ బెంగాల్‌లోని రాధా నగరంలో జన్మించాడు.
రాజా రామ్మోహన్ రాయ్ బిరుదులు :
1) రాజా (మొగలు చక్రవర్తి 2వ అక్బర్ ఇచ్చాడు)
2) ఆధునిక భారతదేశ పితామహ
3) పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా
వార్తాపత్రికలు :
1. మిరాత్-ఉల్-అక్బర్ (పర్షియా)
2. సంవాద కౌముది (బెంగాలీ)
3. బంగదూత
పుస్తకాలు:
1. గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ (పర్షియా)
2. ప్రెసెప్ట్స్ ఆఫ్ జీసస్
3. గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్
సంస్థలు:
1 ఆత్మీయ సభ (1815)
2 బ్రహ్మసమాజ్ (1828) (మొదట్లో దీనిపేరు బ్రహ్మసభ)
రామ్మోహన్‌రాయ్ అత్యధికంగా సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు.
1829లో ఇతని పోరాట ఫలితంగా బ్రిటీష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ సతీసహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు.
ఇతను ఏకేశ్వరోపాసనను బోధించాడు.
విగ్రహారాధనను ఖండించాడు.
మహిళా విద్యను, పాలనలో మహిళల భాగస్వామ్యం, ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు.
బాల్య వివాహాలను ఖండించాడు
ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించేందుకు బ్రహ్మసమాజంలో తరచూ సమావేశాలు జరిగేవి.
అందువలనే బ్రహ్మసమాజ్‌ను ఏకభగవానుని సమాజం అంటారు.
1829లో బ్రహ్మ సమాజ్‌కు వ్యతిరేకంగా రాధాకాంత్ 'దేబోధర్మసభ' ను స్థాపించాడు.
బెంగాల్‌లో అనేక ఆంగ్ల కళాశాలలను స్థాపించాడు.
ఉదా:
1817-హిందూ కళాశాల
1825-వేదాంత కళాశాల
భారత నమాజంలో పాశ్చాత్య భావాలను పెంపొందించుటకు ప్రయత్నించాడు.
వేదాలు, ఉపనిషత్తులు ఏకేశ్వరోపాసనను గురించి మాత్రమే చెబుతున్నాయని పేర్కొంటూ కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి అనువదించి తన వార్తా పత్రికలో ప్రచురించాడు.
రాజారామ్మోహనరాయ్ సామ్రాజ్యవాద వ్యతిరేకి.
1821లో నేపూల్స్ తిరుగుబాటు విఫలమవడంతో తన సమావేశాలను రద్దు చేసుకుని ఒక రోజు ఉపవాసం పాటించాడు.
1828లో దక్షిణ అమెరికాలో స్పానిష్ తిరుగుబాటు విజయవంతం కావడంతో ప్రజావిందును ఇచ్చాడు.
రాజారామ్మోహనరాయ్ లండన్‌ను సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు.
ఇతను 12 భాషల కంటే ఎక్కువ భాషలలో ప్రావీణ్యం కలవాడు.