- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1857 సిపాయిల తిరుగుబాటు (లక్నో/అవధ్/ఝాన్సీ/అర్రా/ఫైజాబాద్):
లక్నో / అవధ్ :
తిరుగుబాటు చేసినవారు - బేగం హజరత్ మహల్
అణచివేసింది - క్యాంప్‌బెల్
బేగం హజత్ మహల్ తన కుమారుడు బిల్జిస్ ఖాదిర్‌ను అవధ్ పాలకుడిగా ప్రకటించి బ్రిటీష్‌పై తిరుగుబాటును ప్రకటించింది.
ఈ తిరుగుబాటులో హజ్రత్ మహల్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.
జనరల్ హెన్రీ లారెన్స్ అవధ్‌లో చంపబడ్డాడు.
అనంతరం లక్నోలోని తిరుగుబాటును అణచివేయుటకు జనరల్.. ఇంగ్లీష్, హేవలాక్, జేట్రమ్, నీల్ మొదలగువారు అవధ్‌కు చేరుకున్నారు, కానీ విఫలమయ్యారు.
చివరిగా జనరల్ క్యాంప్‌బెల్ లక్నో/అవధ్ లోని తిరుగుబాటును అణచి వేశాడు.
ఝాన్సీ:
తిరుగుబాటుదారు - లక్ష్మీబాయ్
అణచివేసింది - జనరల్ హూగ్రోస్
లక్ష్మీబాయ్ శ్రీ గంగాధరరావు భార్య
దత్తత కుమారుడు - దామోదర్‌రావు
ఈమె తాంతియాతోపి సైనికులు మరియు ఆఫ్ఘాన్ పఠాన్‌ల సహకారంతో గ్వాలియర్‌ను ఆక్రమించింది.
అర్రా లేదా జగదీష్ పూర్ (బీహార్):
తిరుగుబాటు చేసింది - కున్వర్‌సింగ్
అణచివేసినది - టేలర్, ఐర్
కున్వర్‌సింగ్ 90 ఏళ్లకు పైబడిన వృద్ధుడు. ఇతను అర్రా ప్రాంతానికి జమిందార్.
అర్రా జమిందారీ పదవి నుంచి తనను తొలగించారన్న కారణంగా బ్రిటీష్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.
అంగ్లేయులు ఇతనిని అణచివేసి ఇతని సోదరుడు అమర్‌సింగ్‌ను అర్రాకు జమీందారుగా ప్రకటించారు.
ఫైజాబాద్ (ఉత్తరప్రదేశ్):
తిరుగుబాటుదారుడు - మౌల్వీ అహ్మదుల్లా
అణచివేసినది - జగన్నాథ్‌సింగ్ (పుల్వాన్ రాజు)
మౌల్వీ అహ్మదుల్లా మద్రాసు నుంచి వచ్చిబ్రిటీష్‌కు వ్యతిరేకంగా ఫైజాబాద్‌లో తిరుగుబాటు చేశాడు.
పుల్వాన్‌రాజు జగన్నాధ్‌సింగ్ మౌల్వీ అహ్మదుల్లాను అణచివేసి బ్రిటీష్ వారి నుండి రూ. 50 వేల రివార్డును పొందాడు.