- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రి నివాసాన్ని ముట్టడించారు. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ విద్యార్థులు సబిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని, లేకుంటే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సబిత ఇంద్రారెడ్డి నివాసం వరకు విద్యార్థులు ర్యాలీగా తరలి వచ్చారు. మంత్రి నివాసం వద్ద బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు కూడా భారీగా మోహరించి విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం మంత్రి సబిత… కొంతమంది విద్యార్థులు, ఎన్ఎస్యూఐ నేతలతో మాట్లాడేందుకు అంగీకరించారు. ఇప్పటికే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామని, విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడే పరీక్షా కేంద్రాలు ఉండే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. అయితే విద్యార్థులందరూ 18 నుంచి 25 ఏండ్లలోపు వారేనని, పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోలేదని, థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారంటూ విద్యార్థులు మంత్రికి సూచించారు.
దీనిపై మంత్రి మాట్లాడుతూ అన్ని అంశాలను పరిశీలించి లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల వాయిదాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని చెప్పి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు మళ్లీ నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. పరీక్షలపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ డిమాండ్‌చేస్తూ మంత్రి నివాసం వద్దే రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.